Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరు గొప్ప?: అశ్విన్‌పై అసూయతోనే భజ్జీ వ్యాఖ్యలు

ఇండోర్: ఇటీవల ఇండోర్‌లో జరిగిన చివరి టెస్టులో విజయం సాధించి న్యూజిలాండ్‌పై 3-0తేడాతో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరిస్‌లో 27 వికెట్లు తీసుకుని బౌలింగ్ అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నేపథ్యంలో టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు. అంతేకాదు భారత క్రికెట్ చరిత్రలో వందేళ్లలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డుని అశ్విన్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో స్ట్రయిక్ రేట్ పరంగా చూస్తే, గత వందేళ్లలో అశ్విన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

ప్రస్తుతం 49.4 స్ట్రయిక్ రేట్‌తో అశ్విన్ కొనసాగుతున్నాడు. ఈ వందేళ్ల కాలంలో ఇంతవరకు 50 కన్నా తక్కువ స్ట్రయిక్ రేట్ గల బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో అశ్విన్‌పై హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

 అసూయతోనే హార్భజన్ సింగ్ విమర్శలు

అసూయతోనే హార్భజన్ సింగ్ విమర్శలు

ఒక సీనియర్‌ ఆటగాడిగా, సాటి క్రికెటర్‌గా హర్భజన్‌ ఇలా మాట్లాడడం మంచిది కాదని కొందరు చెబుతుంటే, భజ్జీ మాత్రం అసూయతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని మరికొందరు విమర్శిస్తున్నారు. అసలు ఇంతకీ భజ్జీ ఏమన్నాడంటే... ‘‘గత నాలుగేళ్లుగా భారత్‌ ఆడుతున్నటువంటి పిచ్‌లపై నేను, కుంబ్లే ఆడుంటే ఇంకా చాలా చాలా వికెట్లు పడగొట్టేవాళ్లం'' అని మూడు వన్డేల టెస్టు సిరిస్‌లో చివరిదైన ఇండోర్‌ టెస్టులో జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో క్రీడా విశ్లేషకులు భజ్జీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

మన పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి

మన పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి

అంతేకాదు మన దేశంలోని పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయన్నది కొత్త విషయమేం కాదని చెబుతూ, న్యూజిలాండ్‌తో సిరీస్‌కు మంచి పిచ్‌లు రూపొందించారని అనవసర వ్యాఖ్యలు చేసి భజ్జీ విమర్శలు కొని తెచ్చుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో స్కోరు కార్డులను చూస్తే భజ్జీ వాదనలో పసలేదని అంటున్నారు. ఈ సిరిస్‌లో అశ్విన్‌ 27 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. వికెట్లు ఏమీ ఈజీగా అశ్విన్ పడగొట్టలేదని, కష్టపడే సాధించాడని ఆట చూసిన ప్రతిఒక్కరికీ తెలుస్తుంది. కాన్పూర్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అశ్విన్‌ 66 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు.

 న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో అత్యుత్తమ గణాంకాలు

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో అత్యుత్తమ గణాంకాలు

ఇక కోల్‌కత్తా టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఓవర్లు, ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 27.2 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఇలా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో అశ్విన్ మొత్తం 27 వికెట్లు తీసుకున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు క‌లిపి మొత్తం 13 వికెట్లు తీసుకుని కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

39 టెస్టులు ఆడి 220 వికెట్లు

39 టెస్టులు ఆడి 220 వికెట్లు

అంతక ముందు ఇదే న్యూజిలాండ్‌పై 2012లో హైదరాబాద్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 85 పరుగులిచ్చి 12 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు కెరీర్‌లో 39 టెస్టులు ఆడిన అశ్విన్‌.. 220 వికెట్లు తీశాడు. ఇక భజ్జీ విషయానికి వస్తే 103 టెస్టులాడి 417 వికెట్లు తీసుకున్నాడు. 2012లో ముంబైలో ఇంగ్లాండ్‌ పై గెలిచిన టెస్టు మ్యాచ్‌లో 84 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

భజ్జీ ప్రదర్శన 3/143

భజ్జీ ప్రదర్శన 3/143

ఇక ఆస్ట్రేలియాతో చెన్నైతో జరిగిన టెస్టులో భజ్జీ ప్రదర్శన 3/143. అదే సమయంలో అశ్విన్‌ 12 వికెట్లు పడగొట్టాడు. వారం తర్వాత హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో హర్భజన్‌ కేవలం రెండు వికెట్లతో సరిపెట్టుకోగా.. అశ్విన్‌, జడేజా చెరో ఆరు వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుత క్రికెట్‌లో అశ్విన్... భజ్జీ వారసుడిగా కీర్తింపబడుతున్నాడు. అయితే భజ్జీ మాత్రం తన వారసుడి గొప్ప తనాన్ని గుర్తించకపోవడం దారుణం. భారత క్రికెట్ చరిత్రలో జట్టుకు హర్భజన్ సింగ్ కూడా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+