Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs RR: రాజస్థాన్ కొంపముంచిన ఐపీఎల్ చెత్త రూల్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. 125 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగిన ఆర్‌సీబీని ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు.

కెప్టెన్ రజత్ పటీదార్(40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63)‌తో 8వ వికెట్‌కు 41 పరుగుల కీలక భాగస్వామ్యంలో భాగమయ్యాడు. అంతేకాకుండా 9వ వికెట్‌కు భువనేశ్వర్ కుమార్(9 నాటౌట్)తో కలిసి అజేయంగా 35 పరుగులు జోడించాడు. దాంతో ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేయగలిగింది.

రూ.7 కోట్లకు న్యాయం..

ముఖ్యంగా సందీప్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో ఒక ఫోర్, రెండు సిక్స్‌లు బాదిన వెంకటేశ్ అయ్యర్ జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. మొత్తం 15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా తనకు పెట్టిన రూ.7 కోట్ల ధరకు న్యాయం చేశాడు.

పిచ్ స్లోగా ఉండటంతో క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న వెంకటేశ్ అయ్యర్.. ఆ తర్వాత దూకుడుగా ఆడి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. వెంకటేశ్ అయ్యర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడకపోయి ఉంటే ఆర్‌సీబీ 170 పరుగులకే పరిమితమయ్యేది.

Impact Player Rule Woes Rajasthan Royals Bowling Effort Goes in Vain Against RCB in IPL 2026

పాపం రాజస్థాన్ బౌలర్లు..

అద్భుతమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీ బ్యాటర్లను కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. డేంజరస్ ఫిల్ సాల్ట్(0), విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 7 ఫోర్లతో 32), దేవదత్ పడిక్కల్(7 బంతుల్లో 3 ఫోర్లతో 14)‌లను పవర్ ప్లేలోనే ఔట్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా(1), జితేష్ శర్మ(5), టీమ్ డేవిడ్‌(13)లను కూడా త్వరగానే ఔట్ చేసింది.

ఓవైపు వికెట్లు పడినా.. మరోవైపు రజత్ పటీదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. స్లాగ్ ఓవర్లలో అతను కూడా ఔటవ్వడంతో ఆర్‌సీబీ 200 పరుగులు చేయడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ రాజస్థాన్ రాయల్స్ లెక్కను తారు మారు చేశాడు.

ఇంపాక్ట్ రూల్‌పై విమర్శలు..

ఈ ఇంపాక్ట్ సబ్ రూల్‌ను మెజార్టీ ఆటగాళ్లు వ్యతిరేకిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు భిన్నంగా ఈ రూల్ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతోంది. ఈ సీజన్ ఆరంభంలోనే 10 జట్ల కెప్టెన్ల మీట్‌లో ఈ రూల్‌ను మెజార్టీ సారథులు వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రూల్ మార్చడం కుదరదని బీసీసీఐ స్పష్టం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ రూల్ వల్ల గేమ్‌లోని అసలు మజా మిస్సవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Story first published: Friday, April 10, 2026, 23:00 [IST]
Other articles published on Apr 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+