ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 టోర్నీలో వెస్టిండీస్ మాస్టర్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన క్రిస్ గేల్(19 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39) విధ్వంసకర బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. డ్వేన్ స్మిత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) సాయంతో తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరికి తోడుగా డియోనరైన్(23 బంతుల్లో 3 సిక్స్‌లతో 35 నాటౌట్), నర్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29) చెలరేగడంతో వెస్టిండీస్ భారీ స్కోర్ చేయగలిగింది.

ఇంగ్లండ్ మాస్టర్స్ బౌలర్లలో మాంటీ పనేసర్(3/14) మూడు వికెట్లు తీయగా. స్కోఫీల్డ్(2/21) రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెమ్లెట్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం ఇంగ్లండ్ మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఫిల్ మస్ట్రడ్(19 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22) తీవ్రంగా నిరాశపరిచాడు. చివర్లో క్రిస్ ట్రెమ్లెట్(19 బంతుల్లో 5 ఫోర్లతో 26), స్టువర్ట్ మీకర్(10 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) పోరాడిన ఫలితం దక్కలేదు.
వెస్టిండీస్ బౌలర్లలో టైలర్, రవి రాంపాల్, సులెమన్ బెన్న్ రెండేసి వికెట్లు తీయగా.. అష్లే నర్స్, డ్వేన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వెస్టిండీస్ మాస్టర్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన ఇండియా మాస్టర్స్ మెరుగైన రన్‌రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
𝐆𝐚𝐲𝐥𝐞 𝐅𝐨𝐫𝐜𝐞 𝐀𝐜𝐭𝐢𝐯𝐚𝐭𝐞𝐝! 👊
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) February 27, 2025
2️⃣ balls, 2️⃣ towering sixes - 𝐓𝐡𝐞 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐞 𝐁𝐨𝐬𝐬 is in 𝐬𝐞𝐬𝐬𝐢𝐨𝐧🚀
Watch the action LIVE on @JioHotstar, @Colors_Cineplex & @CCSuperhits! 📲📺#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/yFOpYUEOvv
6 జట్ల మధ్య పోటీ..
అలనాటి ఆటగాళ్లతో ఈ టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ టోర్నీ మార్చి 16 వరకు జరగనుంది. నవీ ముంబై, రాయ్‌పూర్ వేదికగా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మొత్తం 6 జట్లు ఈ టోర్నీ బరిలో నిలవగా.. ప్రతీ జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్ జట్లు ఈ టోర్నీ బరిలో నిలిచాయి.