Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీని తిట్టాలని డబ్బులు ఆశ చూపారు: జర్మన్ మోడల్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా మాట్లాడాలని కొంతమంది జర్నలిస్ట్‌లు తనకు డబ్బులు ఆశ చూపారని జర్మన్ మోడల్ లిజ్‌లాజ్ ఆరోపించింది. ఇది తనకు అసౌకర్యంగా అనిపించిందని, అయినా తాను అలాంటి మనిషిని కాదని స్పష్టం చేసింది.

లిజ్‌లాజ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేయడంతో భారత్‌లో ఆమెకు పాపులారిటీ దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిజ్‌లాజ్ సంచలన విషయాలను వెల్లడించింది. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలని కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్, జర్నలిస్టులు తనను సంప్రదించారని, డబ్బు కూడా ఆఫర్ చేశారని తెలిపింది.

I m Not That Kind of Person Influencer Lizlaz Claims She Rejected Money to Criticize Virat Kohli
Photo Credit: X (twitter)

'కొంతమంది జర్నలిస్టులు కోహ్లీ గురించి చెడుగా మాట్లాడాలని, అతనికి వ్యతిరేక వ్యాఖ్యలు చేయాలని కోరారు. అందుకు నాకు డబ్బు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ నేను వాటికి ఒప్పుకోలేదు. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాడు తన పోస్ట్‌ను లైక్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇలాంటిది జరుగుతుందని అస్సలు ఊహించలేదు. డబ్బు కోసం కోహ్లీ గురించి చెడుగా ఎందుకు మాట్లాడాలి? నేను అలాంటి మనిషిని కాదు.’అని లిజ్ లాజ్ స్పష్టం చేసింది.

కోహ్లీ తన పోస్ట్ లైక్ చేసిన తర్వాత.. లిజ్‌లాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జెర్సీ ధరించి ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాను కోహ్లీ అభిమానిగా మారిపోయానని, ఆర్‌సీబీకి మద్దతు ఇస్తున్నానని తెలిపింది. లిజ్ లాజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ కారణంతోనే కోహ్లీ దేశం విడిచివెళ్లాడని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీని డీఫేమ్ చేసే కుట్రలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయని, ఈ విషయాన్ని గ్రహించే కోహ్లీ లండన్ వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ తన జోరును కొనసాగిస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 379 పరుగులు చేశాడు. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ డకౌటయ్యాడు. ప్లే ఆఫ్స్ ముందు అతను విఫలవడం ఆందోళనకు గురి చేస్తోంది. కోహ్లీ విఫలమైనా ఆర్‌సీబీ అద్భుత విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుంది. తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ఆర్‌సీబీ టాప్-2 ప్లేస్ ఖరారు కానుంది. ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ను బుధవారం రాయ్‌పూర్ వేదికగా కేకేఆర్‌తో ఆడనుంది.

Story first published: Tuesday, May 12, 2026, 16:40 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+