Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ILT20 2023: 6 బంతుల్లో 5 సిక్స్‌లు.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన యూసఫ్ పఠాన్!

ILT20 2023: All-Rounder Yusuf Pathan Plays A Prank On Dubai Capitals Team Management goes viral

దుబాయ్: టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డ్రెస్సింగ్ రూమ్‌లో అతను చేసిన రచ్చ చర్చనీయాంశమైంది. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన యూసఫ్ పఠాన్.. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి చెందిన దుబాయ్ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. శుక్రవారం డిజర్ట్ వైపర్స్ తో జరిగిన మ్యా‌చ్‌లో యూసఫ్ పఠాన్ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 31 పరుగులు సమర్పించుకున్నాడు.

వెస్టిండీస్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.. యూసుఫ్ పఠాన్ వేసిన ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దాంతో దుబాయ్ క్యాపిటల్స్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లందరి ముందు యూసఫ్ పఠాన్ రచ్చ చేశాడు. తన వల్లే మ్యాచ్ కోల్పోయినట్లు అందరూ తనను చూస్తున్నారని, ఇది తనకు అవమానకరంగా ఉందన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో ఉండలేనని సీరియస్ బ్యాగ్ భుజాన వేసుకొని బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. సహచర ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ వారిస్తున్నా పఠాన్ ఏ మాత్రం వినలేదు. టీమ్ సపోర్ట్ స్టాఫ్‌లోని ఒకరైతే పఠాన్ గదమను పట్టుకొని బతిలాడాడు. ఎవరూ ఎంత చెప్పినా తాను జట్టులో ఉండలేనని రెండడుగులు ముందుకేసాడు. దాంతో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం వేడెక్కింది.

బయటకు వెళ్తున్నట్లు వెళ్లిన యూసఫ్ పఠాన్.. ఇదంతా ప్రాంక్ అన్నట్లు గట్టిగా నవ్వాడు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దుబాయ్ క్యాపటిల్స్ ట్విటర్ వేదికగా పంచుకోగా వైరల్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డిజర్ట్ వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. అనంతరం దుబాయ్ క్యాపిటల్స్ 160 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో పఠాన్ నాలుగు ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

Story first published: Friday, February 3, 2023, 20:40 [IST]
Other articles published on Feb 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+