For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘ఎవడ్రా నీకు చిచ్చా.. నోర్ముయ్’ అభిమానిపై మండిపడ్డ పాక్ ప్లేయర్ (వీడియో)

న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో టీ20లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తనను 'చాచు'అని పిలిచిన ఓ అభిమానిపై పాకిస్థాన్ సీనియర్ ప్లేయర్ ఇఫ్తికర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఎవడ్రా నీకు చాచు.. నోర్ముయ్'అని మండిపడ్డాడు. సదరు వ్యక్తి 'నీకు వీరాభిమానిని'అని చెప్పినా వినిపించుకోలేదు. ఇం

దుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇఫ్తికర్ అహ్మద్‌ను ఓ అభిమాని.. చాచు(మామ) అని సంభోదించగా అతను పట్టరాని కోపంతో ఊగిపోయాడు. సదరు అభిమానిపై నోరు పారేసుకున్నాడు.

Iftikhar Ahmed abuses Pakistani fan for calling him ‘Chachu’ during 2nd T20I vs New Zealand

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఉన్నదంటే చిచ్చాకు కోపం వస్తుంది'అని ఒకరంటే.. 'చిచ్చాను చిచ్చా అనకపోతే ఏం అనాలి?'అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. దొంగ సర్టిఫికేట్స్‌‌తో వయసును తక్కువగా చూపించి పీసీబీని నమ్మిస్తే.. తెలిసిపోదా? అనిఇంకొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పాకిస్థాన్ జట్టులో ఎక్కువ వయసు కలిగిన ఆటగాడు ఇఫ్తికర్ అహ్మదేనని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుత రికార్డ్స్ ప్రకారం అతని వయసు 33 ఏళ్లు. కానీ అతని వయసుపై అనేక సందేహాలు ఉన్నాయి. ఏజ్ టాంపరింగ్‌కు ఇఫ్తికర్ అహ్మద్ పాల్పడ్డాడనే ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కామెంటేటర్లు సైతం అనేక సార్లు ఈ విషయాన్ని చర్చించారు.

అతను 38-40 మధ్య ఉంటాడని పాకిస్థాన్ మీడియానే పేర్కొంది. నెటిజన్లు సైతం ఇఫ్తికర్ అహ్మద్ వాస్తవ వయసు కోసం గూగుల్‌లో తెగ సెర్చ్ చేసారు. ఈ మ్యాచ్‌లో ఇఫ్తికర్ అహ్మద్ దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయని అతను బ్యాటింగ్‌లో 4 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఫిన్ అలెన్(67 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(26), మిచెల్ సాంట్నర్(25) మెరుపులు మెరిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో హ్యారీస్ రౌఫ్(3/38) మూడు వికెట్లు తీయగా.. అబ్బాస్ అఫ్రిది(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆమెర్ జమాల్(1/42), ఉసమా మీర్(1/39)తలో వికెట్ తీసారు.

అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. బాబర్ ఆజామ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66), ఫకార్ జమాన్(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆడమ్ మిల్నే(4/33) నాలుగు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ(2/31), బెన్ సీర్స్(2/28), ఇష్ సోధీ(2/33) రెండేసి వికెట్లు తీసారు.

Story first published: Sunday, January 14, 2024, 17:51 [IST]
Other articles published on Jan 14, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+