Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RohitSharma: రవిశాస్త్రి మాట నిలబెట్టిన హిట్‌మ్యాన్! రెండేళ్ల కిత్రమే అతని సక్సెస్‌పై సవాల్ విసిరిన భారత కోచ్!

If Rohit Sharma Doesnt Become Successful Test Batsman, I Will Consider Myself As Failure:Ravi Shastri

హైదరాబాద్: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ గొప్ప బ్యాట్స్‌మన్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతను నెలకొల్పిన రికార్డులు.. వన్డే క్రికెల్‌లో బాదిన డబుల్ సెంచరీలే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. తనదైన బ్యాటింగ్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో దూసుకుపోయిన హిట్ మ్యాన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం తడబడ్డాడు. సరైన అవకాశాలు లేక మిడిలార్డర్‌ బ్యాటింగ్ చేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకోలేకపోయాడు.

కానీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ధనాధన్ ఫార్మూలాతో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రోహిత్‌ శర్మకు టెస్ట్‌ల్లో సైతం ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. దాంతో రోహిత్ శర్మ తన సత్తా ఏంటో తెలియజేశాడు. అప్పటి నుంచి మళ్లీ వెనుదిరిగి చూడలేదు.

భారత్ గెలిచిన 23 టెస్ట్‌ల్లో

భారత్ గెలిచిన 23 టెస్ట్‌ల్లో

ప్రస్తుతం టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 773 పాయింట్లతో కోహ్లీ తర్వాత 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. సొంతగడ్డపై దుమ్మురేపిన హిట్ మ్యాన్.. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో కూడా రాణించి విదేశాల్లో కూడా సత్తా చాటగలనని నిరూపించాడు. భారత్ ఇటీవల గెలిచిన 23 టెస్ట్‌ల్లో రోహిత్ శర్మ 65.70 సగటుతో 2037 రన్స్ చేశాడు. మొత్తం 37 ఇన్నింగ్స్‌లు ఆడిన హిట్ మ్యాన్.. ఏడు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధికంగా 212 రన్స్ చేశాడు.

నేను విఫలమైనట్లే..

నేను విఫలమైనట్లే..

బొరియా మజుందార్, కుషన్ సర్కార్ రాసిన 'మిషన్ డామినేషన్: యాన్ అన్ ఫినిష్డ్ క్వెస్ట్'అనే పుస్తకంలో రోహిత్ శర్మ‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ రోహిత్ శర్మ సక్సెస్ అవుతాడని హెడ్ కోచ్ రవిశాస్త్రి గట్టిగా నమ్మేవాడని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే హెడ్ కోచ్‌గా తన పదవి కాలం ముగిసేలోపు రోహిత్ సక్సెస్ కాకుంటే.. కోచ్‌గా తాను విఫలమయినట్లేనని రవిశాస్త్రి అన్నాడని ఆ బుక్‌లో పేర్కొన్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ.. లార్డ్స్ టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో మెరిసాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు.

మూడో టెస్ట్‌కు రెడీ..

మూడో టెస్ట్‌కు రెడీ..

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత్ 151 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో లీడ్‌లో నిలిచింది. ఇక లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు సమాయత్తం అవుతుంది.

ఇక ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన సెండ్ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఐదు రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టింది. మూడో టెస్ట్ కోసం లీడ్స్ చేరుకున్న కోహ్లీసేన.. హెడింగ్లే స్టేడియంలో ఆదివారం తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, పంత్‌తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్‌లో శ్రమించారు.

Story first published: Monday, August 23, 2021, 14:05 [IST]
Other articles published on Aug 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+