
వరుసగా మూడు టైటిల్స్
కర్ణ్ శర్మ లక్ ఆర్‌సీబీకి కూడా కలిసొస్తుందని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే కర్ణ్ శర్మ వరుసగా మూడేళ్లు ఐపీఎల్ టైటిళ్లను ముద్దాడాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున తొలిసారి టైటిల్ విన్నర్‌గా నిలిచిన కర్ణ్ శర్మ..2017లో ముంబై ఇండియన్స్ తరఫున రెండోసారి.. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మూడోసారి చాంపియన్‌గా నిలిచాడు. దాంతో వరుసగా మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడిగా కర్ణ్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

జట్టు మారిన ప్రతీసారి..
ఇక 2019లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన కర్ణ్ శర్మకు ఒకే ఒక మ్యాచ్‌లో అవకాశం దక్కగా.. ఆ ఏడాది సీఎస్‌కే ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలై టైటిల్ చేజార్చుకుంది. ఇక 2020లో 5 మ్యాచ్‌లు ఆడిన కర్ణ్ శర్మ దారుణ ప్రదర్శన కనబర్చాడు. టీమ్ సైతం వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఇక 2021 వేలంలో అతన్ని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దాంతో అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరిపోయాడు. తాజా వేలంలో ఆర్‌సీబీ అతన్ని తీసుకోవడంతో ఆ జట్టు అభిమానులంతా అతని లక్ జట్టుకు కలిసొస్తుందని భావిస్తున్నారు. కర్ణ్ శర్మ జట్టు మారిన ప్రతీసారి అతను కొత్తగా చేరిన టీమ్ టైటిల్ గెలిచింది. ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే ఈ సారి ఆర్‌సీబీ చాంపియన్‌గా నిలవనుంది.

డుప్లెసిస్ సారథ్యంలో..
ఆర్‌సీబీలో ఆకర్షణీయ ఆటగాళ్లకు ఎప్పుడూ కొదవ లేదు. జట్టులో ఎందరో స్టార్లు, దమ్మున్నా సారథి ఉన్నా.. ఎందుకో.. ఆర్‌సీబీకి మాత్రం ఐపీఎల్ టైటిల్ అందలేదు. అమ్ములపొదిలో అన్ని అస్త్రాలూ ఉన్నా.. ట్రోఫీపై తొలి ముద్దు కోసం ఆ జట్టు నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఏనాడూ అంచనాలను అందుకోలేకపోయిన బెంగళూరు.. స్థాయికి తగని ఆటతో ప్రతి ఏటా అభిమానులను నిరాశ పరుస్తూనే ఉంది.
ఈ సారి కూడా ఆశలు మాములే. కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఈ టీమ్ పెద్దన్న ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆర్‌సీబీ ఈ సారి కొంచెం కల తప్పినట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది మెగావేలంలో జట్టులోకి వచ్చిన డుప్లెసిస్‌కు కెప్టెన్సీ ఇచ్చిన మేనేజ్ మెంట్.. ఈసారైనా టైటిల్ సాధించాలని ఆశిస్తోంది. ఈ నెల 27న పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్‌సీబీ తమ టైటిల్ వేటను మొదలుపెట్టనుంది

ఆర్‌సీబీ టీమ్:
భారత ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ, అనూజ్, దినేశ్ కార్తీక్, సిసోడియా, అనీశ్వర్, హర్షల్, మహిపాల్ లామ్రోర్, షాబాజ్, ప్రభుదేశాయ్, ఆకాశ్ దీప్, సీవీ మిలింద్, కర్ణ్ శర్మ, సిరాజ్, సిద్దార్థ్ కౌల్.
ఫారిన్ ప్లేయర్లు : డుప్లెసిస్ (కెప్టెన్), హేజిల్‌వుడ్, బెరెండార్ఫ్, హసరంగ, డేవిడ్ విల్లే, మ్యాక్స్‌వెల్, ఫిన్ అలెన్.


Click it and Unblock the Notifications













