Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs New Zealand: ఓడితే సిరీసే కాదు.. అగ్రస్థానం గల్లంతే!

If India loss in 2nd ODI, NewZealand to finish series as World NO. 1

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం హామిల్టన్ వేదికగా జరిగే రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. 300కిపైగా పరుగులు సాధించినా బౌలర్ల వైఫల్యంతో ఓటమి చవిచూసింది. వన్డే సిరీస్ రేసులో నిలవాలంటే రెండో వన్డేలో టీమిండియా తప్పక గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీసే కాదు.. ఐసీసీ వరల్డ్‌ కప్‌ సూపర్ లీగ్‌ పాయింట్ల టేబుల్‌లో భారత్‌ అగ్రస్థానం కోల్పోతుంది.

ప్రస్తుతం భారత్‌ 19 మ్యాచుల్లో 13 విజయాలు, 6 ఓటములతో 129 పాయింట్లు సాధించింది. ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఒక్క విజయానికి పదేసి పాయింట్లు వస్తాయి. ఈ లెక్కన టీమిండియా ఖాతాలో 130 పాయింట్లకు బదులు 129 మాత్రమే ఉండటానికి కారణం పెనాల్టీ ఓవర్‌. ఎన్ని పెనాల్టీ ఓవర్లు వేస్తే అన్ని పాయింట్లు కోత పడతాయి. అలాగే మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లకూ చెరో ఐదేసి పాయింట్లు వస్తాయి. ఈ క్రమంలో భారత్‌కు ఒక పెనాల్టీ ఓవర్‌ ఉండటంతో ఒక పాయింట్‌ తగ్గింది. మరోవైపు న్యూజిలాండ్ 16 మ్యాచుల్లో 12 విజయాలు, నాలుగు ఓటములతో 120 పాయింట్లతో ఉంది. ఒక వేళ రెండో వన్డేలో కివీస్‌ విజయం సాధిస్తే.. అప్పుడు 130 పాయింట్లకు వెళ్లిపోతుంది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న భారత్‌ రెండో స్థానానికి పడిపోతుంది.

ఐసీసీ పాయింట్ల పట్టికలో టాప్‌ - 8 జట్లు భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన ఐదు జట్లు క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈసారి 13 జట్లు బరిలోకి దిగబోతున్నాయి. అయితే భారత్‌ పాయింట్లపరంగా అర్హత సాధించకపోయినా.. ఆతిథ్య జట్టు హోదాలో ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్, కివీస్‌ కాకుండా.. ఇంగ్లండ్‌ (125 పాయింట్లు), ఆస్ట్రేలియా (120), బంగ్లాదేశ్‌ (120), పాకిస్థాన్ (120), అఫ్గానిస్థాన్‌ (110), వెస్టిండీస్ (88) టాప్‌-8లో కొనసాగుతున్నాయి. ఐర్లాండ్‌ (68), శ్రీలంక (62), దక్షిణాఫ్రికా (59), జింబాబ్వే (45), నెదర్లాండ్స్ (25) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Story first published: Saturday, November 26, 2022, 14:49 [IST]
Other articles published on Nov 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+