IPL 2022 : వరుసగా నాలుగు ఓటములు.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే ముంబై ఇండియన్స్‌దే టైటిల్!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది ముంబైకి వరుసగా నాలుగో ఓటమి. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు టైటిల్ విజేతగా ఉన్న ముంబై ఇండియన్స్.. ఈ సీజన్‌లో మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. తొలి విజయం కోసం రోహిత్ సేన నిరీక్షిస్తోంది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చిట్టచివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. గత ఎనిమిదేళ్లలో ఈ తరహాలో ఎప్పుడూ ముంబై ఇండియన్స్ వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోలేదు.

2015లో టైటిల్...
వాస్తవానికి ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్‌ను ఈ వరుస పరాజయాలు ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. అయితే ఆ జట్టు అభిమానులు మాత్రం ఓ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అది రిపీట్ అయితే ముంబై ఇండియన్స్‌దే టైటిళ్ అని చెబుతున్నారు.
అదేంటంటే.. టోర్నీ ఆరంభంలో వరుసగా నాలుగు ఓటముల తర్వాత కూడా పుంజుకుని 2015లో ముంబై విజేతగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కూడా అభిమానులు జోస్యం చెప్తున్నారు.

గతంలో నాలుగు సార్లు..
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ముంబై ఇండియన్స్ ఇలా వరుసగా మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇది నాలుగో సారి. ఆరంభ సీజన్ 2008లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసిన ముంబై.. ఆ తర్వాత 2014, 2015, 2022లోనూ నాలుగు ఓటములతో టోర్నీని ప్రారంభించింది. 2018లోనూ ఆ జట్టు హ్యాట్రిక్ పరాజయాలతో సీజన్‌ను స్టార్ట్ చేసింది.

మెగా వేలం జరిగినప్పుడల్లా..
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? 2008, 2014, 2018, 2022 సీజన్ల ఆరంభానికి ముందు ఐపీఎల్ మెగా వేలం జరగగా.. ఈ వేలం తర్వాత ముంబై ఇండియన్స్ తడబడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు వేదికగా మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. దాంతో మంచి ఆటగాళ్లను కోల్పోయిన ముంబై బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం మరీ వీక్‌గా ఉంది. దాంతోనే ఇప్పటి వరకు విజయాలు అందుకోలేకపోయింది.

సూర్య చెలరేగినా..
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్).. రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(26) రాణించారు. 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని.. జయదేవ్ ఉనాద్కత్(13 నాటౌట్)తో కలిసి సూర్య 7వ వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించాడు. బెంగళూరు బౌలర్లలో వానిందు హసరంగా, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ.. అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 152 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications