Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs SA: కొంపముంచిన కొత్త రూల్.. సిక్సర్‌గా మారిన స్టన్నింగ్ క్యాచ్!

ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా యంగ్ సెన్సేషన్ డెవాల్డ్ బ్రెవిస్ బౌండరీ లైన్‌పై కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసం చేశాడు. కానీ కొత్త రూల్ కారణంగా అతని ప్రయత్నం వృథా అయ్యింది. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైనప్‌పై డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే..?

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా వియాన్ మల్డర్ వేసిన 47వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని కామెరూన్ గ్రీన్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బ్రెవిస్.. గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో సమన్వయం కోల్పోయిన అతను బంతిని మళ్లీ గాల్లోకి ఎగిరేసాడు. కానీ అది బౌండరీ రోప్ బయటే గాల్లోకి లేవడంతో మరోసారి ఎగిరి బంతిని లోపలికి నెట్టేసాడు. పాత రూల్స్ ప్రకారం ఇది సిక్స్ కాదు. కానీ ఐసీసీ, ఎంసీసీ సవరించిన నయా రూల్స్ ప్రకారం ఇది క్లియర్ సిక్స్. ఈ ఘటన అభిమానులను గందరగోళానికి గురి చేసింది. నయా క్యాచ్ రూల్‌పై చర్చకు దారి తీసింది.

ICC s New Rule Turns Dewald Brevis Incredible Boundary Save Into A Six

నయా క్యాచ్ రూల్ ఏంటంటే..?

బౌండరీ లైన్ దాటి గాల్లో బంతిని అందుకుంటే తిరిగి ఒకే ప్రయత్నంలో మైదానంలోకి విసరాలి. విసిరిన వెంటనే గ్రౌండ్‌లోకి వచ్చి క్యాచ్ అందుకోవాలి. లేకపోతే దాన్ని సిక్స్‌గా పరిగణిస్తారు. ఇక్క డెవాల్డ్ బ్రెవిస్ రెండు సార్లు గాల్లోకి ఎగరడంతో నయా రూల్ ప్రకారం సిక్సర్‌గా ఇచ్చారు.

ఎందుకు సవరించారంటే..?

ఆస్ట్రేలియా టీ20 ఫ్రాంచైజీ టోర్నీ బిగ్ బాష్ లీగ్‌లో మైకేల్ నెసర్ అందుకున్న ఓ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. బౌండరీ బయట మైకేల్ నెసర్.. రెండు సార్లు బంతిని తాకి క్యాచ్‌ను పూర్తి చేశాడు. పాత రూల్స్ ప్రకారం అది ఔట్ అయినా.. ఇక నుంచి అలాంటి క్యాచ్‌లు బౌండరీగా మారుతాయి. మైకేల్ నెసర్ అందుకున్న ఈ క్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. దాంతో ఈ రూల్‌ను ఐసీసీ సవరించింది.

Story first published: Monday, August 25, 2025, 10:29 [IST]
Other articles published on Aug 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+