Women's World Cup 2025: టాస్ ఓడిన భారత్.. తెలుగు బిడ్డకు చోటు!
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తమ బౌలింగ్ యూనిట్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు తెలిపింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే బౌలింగ్ ఎంచుకున్నానని పేర్కొంది.
ఏడుగురు బ్యాటర్లు కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పిన ఆటపట్టు.. ఈ టోర్నీ కోసం అన్ని విధాల సిద్దమయ్యామని తెలిపింది. తమ సొంతగడ్డపై ఐదు మ్యాచ్ ఆడనుండటం కలిసొచ్చే అంశమని, అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని తెలిపింది.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ చూడటానికి చాలా బాగుంది. మంచి స్కోర్ చేయగలమని ఆశిస్తున్నాం. మా ప్లేయర్స్ అంతా ఫిట్‌గా ఉన్నారు. మేం ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు స్మృతి మంధాన గొప్పగా ఆడింది. ఆమె నుంచి అదే ప్రదర్శనను ఆశిస్తున్నాం. ఈ రోజు మంచి క్రికెట్ ఆడటానికి మాకు ఇది గొప్ప అవకాశం.'అని హర్మన్‌ప్రీత్ తెలిపింది.
శ్రీలంక : చమరి ఆటపట్టు (కెప్టెన్), హసిని పెరీరా, హర్షిత్ సమరవిక్రమ, విశ్వీ గుణరత్నే, కవిష దిల్హరి, నిలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), అచిని కులసూరియ, సుగంధిక కుమారి, ఉదేశిక ప్రబోధాని, ఇనోకా రణవీర.
భారత్: ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications