Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆస్ట్రేలియాదే బ్యాటింగ్.. మూడు మార్పులతో భారత్!

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ పేర్కొంది.

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఈ కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. భారీ లక్ష్యాన్ని నమోదు చేసేందుకు ఇది ఓ సువర్ణవకాశం. 10 రోజులు విరామంతో గాయం నుంచి కోలుకున్నాను. సెమీఫైనల్లో ఎవరు మెరుగ్గా ఆడితే వారినే విజయం వరిస్తుంది. మా తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. వేర్‌హామ్ స్థానంలో సోఫీ మోలిన్యుక్స్ వచ్చింది.'అని అలిస్సా హీలీ చెప్పుకొచ్చింది.

ICC Women s World Cup 2025 India Make Bold Selection Call Australia Opt To Bat In Semifinal

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. 'మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఆరంభంలోనే వికెట్లు తీస్తే మ్యాచ్‌పై పట్టుబిగించవచ్చు. ఈ పిచ్ గురించి మాకు బాగా తెలుసు. ఇక్కడ మేం చాలా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాం. అంతేకాకుండా మా చివరి రెండు లీగ్ మ్యాచ్‌లను కూడా ఇక్కడే ఆడాం.

ఆస్ట్రేలియాతో ఆడినప్పుడల్లా మేం ఫియర్‌లెస్ గేమ్ ఆడాలని నిర్ణయించుకుంటాం. దురదృష్టవశాత్తు గాయం కారణంగా ప్రతీక ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఆమె స్థానంలో షఫాలీ వర్మ బరిలోకి దిగుతుంది. ఉమా, హర్లీన్ డియోల్ స్థానంలో రిచా ఘోష్, క్రాంతి తిరిగి జట్టులోకి వచ్చారు.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.

తుది జట్లు:

భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్‌జోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.

ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ (వికెట్ కీపర్/కెప్టెన్), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డ్‌నర్, తహిలియా మెక్‌గ్రాత్, సోఫీ మోలిన్యుక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షూట్.

Story first published: Thursday, October 30, 2025, 15:03 [IST]
Other articles published on Oct 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+