
సౌతాఫ్రికాXవెస్టిండీస్ మ్యాచ్‌తో..
ఇక ఓటమెరుగని టీమ్‌గా టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆసీస్ సెమీఫైనల్ బెర్త్ ఖారారు చేసుకోగా.. 8 పాయింట్లతో సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది. చివరి రెండు స్థానాల కోసం భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య రేపు జరిగే మ్యాచ్‌తో సెమీఫైనల్ బెర్త్‌పై క్లారిటీ రానుంది. ఒకవేళ సౌతాఫ్రికాతో భారత్ ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఫలితాలు మిథాలీ సేన భవితవ్యాన్ని నిర్లయిస్తాయి.

సౌతాఫ్రికాతో ఓడినా..
వెస్టిండీస్ మహిళలు 6 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికాతో రేపు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటారు. లేకుంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్.. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌పై విజయాలు సాధిస్తే సెమీస్ అవకాశాలుంటాయి. ఈ రెండింటిలో ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు అవకాశాలు సంక్లిష్టమవుతాయి. ఒకవేళ సౌతాఫ్రికాతో చివరి మ్యాచ్ ఓడి, ఇంగ్లండ్ సైతం తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ఓడినా మెరుగైన రన్ రేట్ ఉన్న భారత్‌కే సెమీస్ బెర్త్ దక్కతుంది.

యస్తికా భాటియా సూపర్ ఫిఫ్టీ..
బంగ్లాతో మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 229 పరుగులు చేసింది. యస్తికా భాటియా(80 బంతుల్లో 2 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. పూజా వస్త్రాకర్(33 బంతుల్లో 2 ఫోర్లతో 30 నాటౌట్), షెఫాలీ వర్మ(42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42) పర్వాలేదనిపించారు.
స్నేహ్ రాణా(23 బంతుల్లో 2 ఫోర్లతో 27) విలువైన పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ మిథాలీ రాజ్(0), హర్మన్ ప్రీత్ కౌర్(14) దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రితు మోని మూడు వికెట్లు తీయగా.. నహిదా అక్తర్ రెండు, జహనరా అలామ్ ఓ వికెట్ పడగొట్టింది

చెలరేగిన బౌలర్లు..
అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి 40.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ జట్టులో సల్మా ఖాటున్(32), లతా మోండల్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. ఇందులో ఇద్దరు డకౌట్‌గా వెనుదిరిగాడు.
భారత బౌలర్లలో స్నేహ్ రాణా(4/30) నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. జులాన్ గోస్వామి(2/19), పూజావస్త్రాకర్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తలో వికెట్ తీసారు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తికా భాటియాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.


Click it and Unblock the Notifications
