
మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఈ యువ సంచలనం 47 పరుగుల వద్ద రనౌట్‌గా పెవిలియన్ చేరింది.
షెఫాలీ ధాటికి పవర్ ప్లేలోనే 50 పరుగులు చేసిన భారత్ 10 ఓవర్లలో 86 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మరో ఓపెనర్ స్మృతి మంధాన (17), కెప్టెన్ హర్మన్ ప్రీత్(15) ఔటైనా.. షెఫాలీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది.
5,13 పరుగుల వద్ద ప్రత్యర్థి ఫీల్డింగ్ తప్పిదాలతో బతికిపోయిన షెఫాలీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. ప్రస్తుతం 12 ఓవర్లకు భారత్ 95/3 పరుగులు చేసింది. క్రీజులో జెమీమా(3 బ్యాటింగ్), దీప్తీ(6 బ్యాటింగ్) ఉన్నారు.
భారత్ విజయానికి ఇంకా 48 బంతుల్లో19 పరుగులు అవసరం. అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది