Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రప్ఫాడించిన రాధా యాదవ్.. భారత్‌కు స్వల్ప లక్ష్యం

ICC Womens T20 World Cup: Radha Yadav, Gayakwad leave Sri Lanka reeling

మెల్‌బోర్న్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ రాధా యాదవ్ రఫ్ఫాడించింది. (4/23)నాలుగు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ చమరి ఆటపట్టు(33), కవిశ దిల్‌హరి(25 నాటౌట్) టాప్‌స్కోరర్లుగా నిలిచాడు. భారత బౌలింగ్‌లో రాధా యాదవ్‌ నాలుగు వికెట్లతో పాటు రాజేశ్వర్ గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. దీప్తీ శర్మ, శిఖా పాండే, పూనమ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

ఆదిలోనే షాక్..

టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన శ్రీలంకకు భారత బౌలర్ దీప్తీ శర్మ ఆదిలోనే షాకిచ్చింది. ఓపెనర్ ఉమేశా తిమాసిని(2)ని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత్‌కు శుభారంభాన్నిచ్చింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్షిత మాద్వి(10)తో కెప్టెన్ చమరి పట్టు ధాటిగా ఆడింది. దీంతో శ్రీలంక మహిళలు పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేశారు.

చెలరేగిన రాధా..

ఇక క్రీజులో కుదురుకుంటున్న హర్షిత-ఆటపట్టు జోడీని రాజేశ్వరీ విడదీసింది. హర్షిత(12)ను క్లీన్ బౌల్ట్ చేసి పెవిలియన్ చేర్చింది. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 30 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత ఆటపట్టును ఔట్ చేసిన రాధా యాదవ్, ఆ వెంటనే హాసిని పెరేరా(7)ను పెవిలియన్‌కు చేర్చి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీసింది. మరి కొద్ది సేపటికే కరుణ రత్నేను రాధా ఔట్ చేయగా.. సిరి వర్ధనే(13)ను గైక్వాడ్ పెవిలియన్ చేర్చింది. దీంతో శ్రీలంక 78 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

కవిష ఒంటరి పోరాటం..

కవిష ఒంటరి పోరాటం..

వరుస ఓవర్లలో డిసిల్వా(8), అనుష్క సంజీవని(1) ఔటవ్వడంతో శ్రీలంక 100 లోపు ప్యాకప్ అవుతుందని అందరూ భావించారు. కానీ లోయార్డర్‌లో కవిష(25 నాటౌట్) ఒంటరి పోరాటం చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. భారత బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంది. దీంతో శ్రీలంక 100 మార్క్‌ను ధాటగలిగింది.

Story first published: Saturday, February 29, 2020, 11:28 [IST]
Other articles published on Feb 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+