For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ వేదికగా జరిగే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిరాకరించినట్లు తెలుస్తోంది. మెగా టోర్నీకి తక్కువ సమయం ఉండటంతో వేదికల తరలింపు సాధ్యం కాదని బీసీబీకి ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే జనవరి 21లోపు భారత్‌కు వచ్చేది రానిది తేల్చుకోవాలని బీసీబీకి ఐసీసీ డెడ్‌లైన్ విధించినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది. అయితే ఈ విషయంపై ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ బంగ్లాదేశ్ మొండిపట్టుతో ఉంటే టోర్నీ నుంచి తప్పించనున్నారు. బంగ్లా స్థానంలో తదుపరి ర్యాంక్ కలిగిన స్కాట్లాండ్‌ జట్టు వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.

ICC Warns Bangladesh Scotland Emerges as Potential Replacement for T20 World Cup Report

ఐసీసీ ససేమిరా..

ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు జరిగే టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంత తక్కువ సమయంలో వేదికలను తరలించడం సాధ్యం కాదని ఐసీసీ చెబుతోంది.

అయినా బీసీబీ మొండి పట్టు వీడటం లేదు. ఈ క్రమంలోనే ఢాకాలో జరిగిన సమావేశం‌లో బీసీబీకి ఐసీసీ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ జట్టు భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని ఐసీసీ హామీ ఇచ్చినట్లు సమాచారం.

ముంబై, కోల్‌కతాలో మ్యాచ్‌లు..

ఇంగ్లండ్, ఇటలీ, నెపాల్‌, వెస్టిండీస్‌తో గ్రూప్‌ సీలో ఉన్న బంగ్లాదేశ్‌.. లీగ్ దశలో భారత్ వేదికగా నాలుగు మ్యాచ్‌లే ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7న కోల్‌కతా‌లోని ఈడెన్ గార్డెన్స్‌లో తమ తొలి మ్యాచ్ లో వెస్టిండీస్‌తో.. ఇదే వేదికగా ఫిబ్రవరి 9న ఇటలీ‌, ఫిబ్రవరి 14న ఇంగ్లండ్‌తో బంగ్లాదేశ్ తదుపరి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఫిబ్రవరి 17న ముంబైలోని వాఖండే వేదికగా నేపాల్‌తో మూడో మ్యాచ్‌ ఆడనుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి బహిష్కరించాలని భారత్ వ్యాప్తంగా డిమాండ్లు రావడంతో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను కేకేఆర్ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న బీసీబీ భద్రత పరమైన కారణాలను తెరమీదికి తెచ్చింది.

Story first published: Monday, January 19, 2026, 16:50 [IST]
Other articles published on Jan 19, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+