Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: దుమ్మురేపిన యశస్వి జైస్వాల్.. దిగజారిన రోహిత్, కోహ్లీ!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశ్వసి జైస్వాల్ దుమ్మురేపాడు. ఒక స్థానాన్ని మెరుగు పరుచుకొని ఐదో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున టాప్ ర్యాంక్ కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

ఈ ప్రదర్శనతోనే ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని టాప్ 5 ర్యాంక్ అందుకున్నాడు. మరోవైపు బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఐదేసి స్థానాలు దిగజారారు. రోహిత్ 10వ స్థానంలో నిలవగా.. కోహ్లీ 12వ స్థానంలో నిలిచాడు.

ICC Test Rankings Yashasvi Jaiswal becomes India s highest ranked Test batter

ఈ మ్యాచ్‌లో శతకంతో రాణించిన రిషభ్ పంత్ తన ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. శుభ్‌మన్ గిల్ 5 స్థానాలు మెరుగు పరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డారిల్ మిచెల్ రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో నిలవగా.. ఉస్మాన్ ఖవాజా ఏడో స్థానంలో నిలిచాడు.

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, ఆసీస్ స్టార్ మార్నస్ లబుషేన్ 8,9వ స్థానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ 11వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా తమ టాప్ ర్యాంకులను నిలబెట్టుకోగా.. జడేజా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 6వ స్థానానికి చేరాడు.

బంగ్లాతో తొలి టెస్ట్‌లో అశ్విన్ 6 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లో శతకం సాధించాడు. బుమ్రా.. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్‌తో మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన వారి ర్యాంకులు చెదరకుండా చేసింది. తొలి టెస్ట్ ఆడని కుల్దీప్ యాదవ్ ఒక స్థానం కోల్పోయి 16వ స్థానంలో నిలిచాడు.

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ టాప్2 ర్యాంకులను నిలబెట్టుకున్నారు. అక్షర్ పటేల్ 6వ స్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

Story first published: Wednesday, September 25, 2024, 14:22 [IST]
Other articles published on Sep 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+