అంతర్జాతీయ క్రికెట్ కౌనిల్స్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్-10లో నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 767 రేటింగ్ పాయింట్స్‌తో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే.
దాంతో అతను హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఆడలేదు. అయినా కోహ్లీ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని ఆరో స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 729 రేటింగ్ పాయింట్స్‌తో ఒక స్థానం దిగజారి 12వ స్థానంలో నిలిచాడు. గతేడాదిగా ఆటకు దూరంగా ఉన్న రిషభ్ పంత్ 721 రేటింగ్ పాయింట్స్‌తో 13వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్(832), ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(818), న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్(786), పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్(768) వరుసగా టాప్-5 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 853 రేటింగ్ పాయింట్స్‌తో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
హైదరాబాద్ టెస్ట్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ టాప్-2 ర్యాంకులను నిలబెట్టుకున్నారు. అక్షర్ పటేల్ ఒక స్థానం దిగజారి ఆరో స్థానంలో నిలిచాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ తన మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు సన్నదమవుతోంది. మంగళవారమే వైజాగ్‌కు చేరుకున్న టీమిండియా.. బుధవారం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించనుంది. రోహిత్ శర్మకు వైజాగ్ అమ్మమ్మ ఊరు కావడం.. ఈ వికెట్‌పై అతనికి మంచి రికార్డు ఉండటంతో ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక రెండో టెస్ట్‌కు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో దూరమయ్యారు. వారి స్థానాల్లో సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్‌లు జట్టులోకి వచ్చారు.