For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అగ్ర స్థానాన్ని పదిలం చేసుకున్న కోహ్లీ, టాప్ 10లోకి నాథన్

ICC Test rankings: Virat Kohli consolidates No. 1 spot as Kane Williamson achieves career-best rating points

న్యూఢిల్లీ: ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో సెంచరీకి మించిన స్కోరు సాధించడంతో విరాట్ కోహ్లి టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే రెండో స్థానానికి కోహ్లీకి కేవలం 19పాయింట్లు మాత్రమే తేడా ఉంది. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేసిన కోహ్లి.. 934 పాయింట్లతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో నిలిచాడు.

టాప్ 1 కోహ్లీ, 2లో విలియమ్సన్

టాప్ 1 కోహ్లీ, 2లో విలియమ్సన్

అబుదాబి టెస్టులో 89, 139 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (915) రెండో స్థానంలో ఉన్నాడు. మరో కివీస్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్ ఇటీవల లంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 264పరుగులు చేసి ఇంకా మెరుగైన స్థానాన్ని దక్కించుకున్నాడు. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేన్ వరుసగా 89, 139పరుగులు చేశాడు. ఇలా ఆసియా గడ్డ మీద పాక్‌పై టెస్టు విజయాన్ని అందుకున్న తొలి కివీస్ కెప్టెన్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన కేన్.. 900కిపైగా పాయింట్లు సాధించిన తొలి కివీస్ బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డులకెక్కాడు.

పోటీ అనేది బంతికి.. బ్యాట్‌కి మాత్రమే: గంభీర్

816 పాయింట్లతో పూజారా 3వ స్థానంలోకి

816 పాయింట్లతో పూజారా 3వ స్థానంలోకి

వీరితో పాటు ఆస్ట్రేలియా పర్యటన తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులో పాతుకపోయి భారత జట్టుకు కీలక స్కోరు అందించిన పూజారా టాప్ 5లోకి చేరిపోయాడు. అడిలైడ్ టెస్టులో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన పుజారా.. 816 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

పదకొండు స్థానాలు ఎగబాకిన పంత్

పదకొండు స్థానాలు ఎగబాకిన పంత్

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆటకు దూరమైన స్టీవ్ స్మిత్.. 892 పాయింట్లతో మూడో స్థానానికి దిగజారాడు. రహానే 3 స్థానాలు మెరుగుపర్చుకొని 15వ ర్యాంక్‌కు చేరుకోగా.. పంత్ 11 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంక్ సాధించాడు.

బౌలర్లలో నాథన్ మెరుగ్గా 8వ స్థానంలోకి

బౌలర్లలో నాథన్ మెరుగ్గా 8వ స్థానంలోకి

పెర్త్ టెస్టులో 8 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్న ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్ జాబితాలో ఏడో స్థానానికి చేరుకున్నాడు. హెజిల్‌వుడ్ 9వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బ్యాట్స్‌మన్‌కు ధీటుగా తమ ప్రదర్శనతో అలరించిన వాళ్లలో మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మలు ఉన్నారు. షమీ బౌలింగ్‌తో మాయాజాలాన్ని ప్రదర్శించి 6/56గా నిలిచాడు. ఈ క్రమంలో షమీ 21 వ స్థానంలో నిలవగా, ఇషాంత్ శర్మ ఐదు వికెట్ల పడగొట్టి 26వ స్థానంలో నిలిచి ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ కంటే ముందు వరుసలో నిలిచాడు.

Story first published: Thursday, December 20, 2018, 14:26 [IST]
Other articles published on Dec 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+