ICC Test rankings:టాప్-2లో స్టువర్ట్ బ్రాడ్.. బాబర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్!

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ టాప్-2 ర్యాంక్ అందుకున్నాడు. పాకిస్థాన్‌తో సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో నాలుగు వికెట్లతో చెలరేగిన బ్రాడ్ (4/56) ఒక్కొస్థానాన్ని మెరుగు పరుచుకొని రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్లు నీల్ వాగ్నర్, టీమ్ సౌథి రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక రెండో టెస్ట్(3/60) మూడు వికెట్లతో రాణించి జేమ్స్ అండర్సన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 14 స్థానంలో నిలిచాడు.
ఇక భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానానికి దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ పాక్-ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు రెండో స్థానంలో ఉన్న బుమ్రా ఏకంగా 9వ స్థానానికి పడిపోవడం గమనార్హం. రెండు వికెట్లతో రాణించిన పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ ఒక్క స్థానాన్ని మెరుగుపరుచుకొని 8వ ర్యాంకు అందుకున్నాడు.
బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంకు అందుకున్నాడు. తద్వార మూడు ఫార్మాట్లలోనూ బ్యాటింగ్ జాబితాలో తొలి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రెండో టెస్ట్‌లో కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన అబిద్ అలీ 49వ, మహ్మద్ రిజ్వాన్ 75వ ర్యాంకులు అందుకున్నారు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, కెప్టెన్ జో రూట్ వరుసగా ఏడు, తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇంగ్గండ్-పాక్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఓ రోజు ఆటను మింగేసిన వర్షం.. రెండో టెస్టులో కనీసం రెండు ఇన్నింగ్స్‌ల ఆట కూడా సాగలేదు. తొలి రోజు సగం ఆట వరుణుడి కారణంగా నిలిచిపోగా.. రెండో రోజు కూడా అదే కథ కొనసాగింది. మూడో రోజు అయితే ఒక్కబంతి కూడా పడలేదు. ఇక నాలుగో రోజు కేవలం 10.2 ఓవర్లు మాత్రమే పడ్డాయి. మ్యాచ్ చివరి రోజు, సోమవారం కూడా వర్షం వెంటాడింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
సోమవారం ఉదయం వర్షం, ఆ తర్వాత పిచ్ చిత్తడిగా మారడంతో తొలి రెండు సెషన్ల ఆట వీలు కాలేదు. చివరికి మైదానాన్ని సిద్ధం చేయడంతో.. టీ బ్రేక్ తర్వాత ఇరు జట్లు బరిలోకి దిగాయి. అయితే 36 ఓవర్ల ఆట తర్వాత ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. ఓవర్‌నైట్ స్కోరు 7/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 110/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఈ స్థితిలో రెండు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (53) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications