Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: శుభ్‌మన్ గిల్, బుమ్రాకు బిగ్.. పాతాళానికి బాబర్ ఆజామ్!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో ఈ ఇద్దరూ ఆటగాళ్లు తమ టాప్ ప్లేస్‌లను కోల్పోయారు. శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌లో రెండు శతకాలతో చెలరేగిన దేవదత్ పడిక్కల్ దూసుకొచ్చాడు.

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ నమోదు చేసిన శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు. రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన రిషభ్ పంత్ తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అత్యుత్తమ ర్యాంక్ కలిగిన భారత ఆటగాడిగా నిలిచాడు.

ICC Test Rankings Shubman Gill and Jasprit Bumrah Slip Devdutt Padikkal Moves Up as Babar Azam s Slide Continues

యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన 11వ స్థానాన్ని నిలబెట్టుకోగా.. 328 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన దేవదత్ పడిక్కల్ ఐదు స్థానాలు ఎగబాకి 54వ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. కొలంబో టెస్ట్‌లో అద్భుతమైన శతకాలు సాధించిన శ్రీలంక బ్యాటర్ సోనాల్ దినూష 29 స్థానాలు ఎగబాకి 25వ స్థానానికి చేరుకున్నాడు.

దిగజారిన బుమ్రా ర్యాంక్..

ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా ఒక ప్లేస్ దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌కు చెందిన మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

మోకాలి గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అఫ్గానిస్థాన్‌తో జరిగే అప్‌కమింగ్ టీ20 సిరీస్‌తో బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

పాతాళానికి బాబర్ ఆజామ్..

పాకిస్థాన్‌తో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకు అందుకున్నాడు. ఐదు వికెట్లు తీసిన జోష్ టంగ్.. కెరీర్ బెస్ట్ 13వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసిన పాకిస్థాన్ ప్లేయర్ మహమ్మద్ అబ్బాస్, బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లామ్‌తో కలిసి 15వ స్థానంలో కొనసాగుతున్నాడు.

బాబర్ ఆజామ్ చెత్త రికార్డ్.. బౌలర్లతో పోటీపడుతున్న పాకిస్థాన్ కింగ్!

Also Read

బాబర్ ఆజామ్ చెత్త రికార్డ్.. బౌలర్లతో పోటీపడుతున్న పాకిస్థాన్ కింగ్!

ఈ టెస్ట్‌లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్(14) ఐదు స్థానాలు దిగజారి 15వ స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో టెస్ట్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన బాబర్ ఆజామ్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. కానీ గాయంతో ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ఆడని అతను రెండో టెస్ట్‌లో విఫలమవడంతో ఐదు స్థానాలు దిగజారాడు.

Story first published: Wednesday, September 2, 2026, 18:28 [IST]
Other articles published on Sep 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+