ICC Test Rankings: జడేజా నంబర్ వన్.. టాప్-5లోకి కోహ్లీ!

దుబాయ్: బ్యాట్, బాల్‌తో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో ఐదేళ్ల తర్వాత టెస్ట్ ఆల్‌రౌండర్స్ జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. శ్రీలంకతో ఇటీవల ముగిసిన ఫస్ట్ టెస్ట్‌లో జడేజా బ్యాటుతో, బంతితో అదిరే ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో 175 రన్స్‌తో పాటు 9 వికెట్లు తీసిన జడేజా.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జడ్డూ నంబర్ వన్ ర్యాంకు అందుకోవడం ఇది రెండో సారి. 2017 ఆగస్టులో వారం రోజులు ఆ ప్లేస్‌లో ఉన్నాడు. 'శ్రీలంకతో తొలి టెస్టులో రవీంద్ర జడేజా ప్రదర్శన పురుషుల టెస్టు ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అతన్ని నంబర్‌వన్ స్థానానికి తీసుకెళ్లింది'' అని ఐసీసీ ట్వీట్ చేసింది.

17 స్థానాలు ఎగబాకి..
లంకపై తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 175 పరుగులు చేసిన జడేజా.. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 17 స్థానాలు ఎగబాకాడు. 54 నుంచి 37వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టడంతో బౌలర్ల జాబితాలో 17వ స్థానానికి ఎగబాకాడు. ఈ ఆల్‌రౌండర్ జోరుతో గతేడాది ఫిబ్రవరి నుంచి అగ్రస్థానంలో ఉంటున్న జేసన్ హోల్డర్ రెండో స్థానానికి పడిపోయాడు. శ్రీలంకపై తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో నెగ్గగా.. జడేజా 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

టాప్-5లోకి కోహ్లీ
మరో భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం నష్టపోయి మూడో ర్యాంకులో నిలిచాడు. అక్షర్ పటేల్ 14వ స్థానంలో ఉన్నాడు. గాయం కారణంగా మొహాలి టెస్టులో ఆడని అతను రెండు స్థానాలు కోల్పోయాడు. ఇక బాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉన్నాడు. మొహాలి టెస్టులో ధాటిగా 96 పరుగులు చేసిన వికెట్‌కీపర్ రిషబ్ పంత్ టాప్-10లో అడుగుపెట్టాడు. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని పదో స్థానంలో నిలిచాడు.

ఆ ర్యాంకుల్లో మార్పుల్లేవ్..
కేఎల్ రాహుల్ 38వ స్థానంలో ఉన్నాడు. మార్నస్ లబుషేన్ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. రూట్ రెండో స్థానంలో, స్మిత్ మూడో స్థానంలో ఉన్నాడు. విలియమ్సన్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా ర్యాంకు (10వ)లో కూడా మార్పు లేదు. ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రబడా మూడో స్థానంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications