
బర్మింగ్‌హమ్: ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కునెట్టిన న్యూజిలాండ్ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలవడంతో కివీస్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరింది. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్(123 పాయింట్లు), భారత్(121 పాయింట్లు), ఆస్ట్రేలియా (108 పాయింట్లు) వరుసగా టాప్-3లో ఉన్నాయి.
కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 38 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 10.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసి గెలిచింది. 1999లో స్టీఫెన్ ఫ్లెమింగ్ నాయకత్వంలోని న్యూజి లాండ్ బృందం ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.
ఆ తర్వాత న్యూజిలాండ్‌కు దక్కిన తొలి టెస్టు సిరీస్ విజయం ఇదే కావడం విశేషం. మరోవైపు 2014 తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం ఇంగ్లండ్‌కు ఇదే మొదటిసారి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 122/9తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్... రోజు తొలి బంతికే మిగిలిన వికెట్‌ను కోల్పోయి ఆలౌటైంది. హెన్రీ, వ్యాగ్నర్ చెరో మూడు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 303 రన్స్ చేయగా.. కివీస్ 388కి ఆలౌటైంది. సిరీస్‌లో ఫస్ట్ టెస్ట్ డ్రాగా ముగిసింది. కాగా, డెవాన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, హెన్రీకి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు లభించాయి.