Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: టాప్ లేపిన కేన్ మామ.. చేజారిన స్మిత్ ర్యాంక్.. కోహ్లీ ప్లేస్ సేఫ్!

ICC Test Rankings: Kane Williamson overtakes Virat Kohli and Steve Smith to become No.1 batsman

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాప్ లేపాడు. పాకిస్థాన్‌తో తాజాగా ముగిసిన టెస్ట్‌లో సెంచరీతో కదం తొక్కి విజయంలో కీలక పాత్ర పోషించిన కేన్ మామ.. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 890 పాయింట్లతో రెండు స్థానాలను ఎగబాకి బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. 2015 తర్వాత విలియమ్సన్ మళ్లీ టాప్‌లో నిలవడం ఇదే తొలిసారి.

ఇక భారత్‌తో టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన స్టీవ్ స్మిత్.. తన టాప్ ర్యాంక్‌‌ను చేజార్చుకొని మూడో స్థానానికి పడిపోయాడు. ఈ ఇద్దరి మధ్య టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం పెటర్నిటీ లీవ్ తీసుకున్న విరాట్.. ఫస్ట్ టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో రాణించడంతో తన ర్యాంక్‌ను పదిలంగా ఉంచుకున్నాడు. కానీ స్మిత్(877), విరాట్(879) మధ్య కేవలం రెండు పాయింట్ల వ్యత్యాసమే ఉంది. మూడో టెస్ట్‌లో స్మిత్ చెలరేగితే కోహ్లీ తన స్థానాన్ని కోల్పోనున్నాడు.

భారత్‌తో కాస్తో కూస్తో రాణిస్తున్నా ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్ తన నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీతో కదం తొక్కిన భారత తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే ఏకంగా 5 స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. వార్నర్ ఓ స్థానం దిగజారి ఏడో స్థానానికి పడిపోగా.. చతేశ్వర్ పుజారా రెండు స్థానాలు చేజార్చుకొని టాప్-10లో నిలిచాడు. వరుసగా 5 టెస్ట్ విజయాలతో దుమ్ములేపిన న్యూజిలాండ్.. టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకుంది.

బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 7వ స్థానంలో నిలవగా.. జస్‌ప్రిత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి 9వ స్థానంలో నిలిచాడు. అరంగేట్ర ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకొని 76, 77 వస్థానాల్లో నిలిచారు.

Story first published: Thursday, December 31, 2020, 11:53 [IST]
Other articles published on Dec 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+