T20 World Cup 2026: సూపర్-8 చేరిన జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ లీగ్ మ్యాచ్‌లు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 20 జట్లు బరిలోకి దిగిన ఈ టోర్నీలో 8 టీమ్స్ ముందడుగు వేసాయి. 20 జట్లను మొత్తం నాలుగు గ్రూప్‌లుగా విభజించగా.. ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని ప్రత్యర్థి జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడింది. ఈ లెక్కన ప్రతీ జట్టు 4 లీగ్ మ్యాచ్‌లు ఆడింది. ప్రతీ గ్రూప్‌లోని టాప్-2 టీమ్స్ సూపర్-8కు అర్హత సాధిస్తాయి.
సూపర్-8 చేరిన జట్లు ఇవే..
- గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా తలపడ్డాయి. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్ గ్రూప్ టాపర్‌గా నిలవగా.. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన పాకిస్థాన్ రన్నరప్‌గా సూపర్-8 చేరింది. అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
- గ్రూప్-బీలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంక, మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, ఒకటి రద్దవ్వడంతో జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించాయి. ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఒమన్ లీగ్ దశలోనే వెనుదిరిగాయి. ఈ గ్రూప్ నుంచి ఆసీస్ వైదొలగడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
- గ్రూప్ సీలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన వెస్టిండీస్, 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచిన ఇంగ్లండ్ సూపర్-8కు క్వాలిఫై అయ్యాయి. స్కాంట్లాండ్, ఇటలీ, నేపాల్ తప్పుకున్నాయి.
- గ్రూప్-డీలో 4 మ్యాచ్‌లకు 4 గెలిచిన సౌతాఫ్రికా, నాలుగింటిలో మూడు గెలిచిన న్యూజిలాండ్ ముందడుగు వేయగా.. అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడా నిష్క్రమించాయి.
గ్రూప్-ఏ: భారత్, పాకిస్థాన్
గ్రూప్-బీ: శ్రీలంక, జింబాబ్వే
గ్రూప్-సీ: వెస్టిండీస్, శ్రీలంక
గ్రూప్-డీ: సౌతాఫ్రికా, న్యూజిలాండ్

సూపర్-8 షెడ్యూల్..
సూపర్ 8 చేరిన జట్లను సీడింగ్ ప్రకారం రెండు గ్రూప్స్‌గా విభజించారు. లీగ్ దశలో తలపడిన జట్లు సూపర్-8లో తలపడవు. గ్రూప్-1లో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూప్-2లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. సూపర్-8లో ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే ప్రతీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. రెండు గ్రూప్స్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
ఫిబ్రవరి 21: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ గ్రూప్ 2 కొలంబో రాత్రి 7:00
ఫిబ్రవరి 22 ఇంగ్లాండ్ vs శ్రీలంక గ్రూప్ 2 క్యాండీ మధ్యాహ్నం 3:00
ఫిబ్రవరి 22 భారత్ vs సౌతాఫ్రికా గ్రూప్ 1 అహ్మదాబాద్ రాత్రి 7:00
ఫిబ్రవరి 23 వెస్టిండీస్ vs జింబాబ్వే గ్రూప్ 1 ముంబై రాత్రి 7:00
ఫిబ్రవరి 24 ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ గ్రూప్ 2 క్యాండీ రాత్రి 7:00
ఫిబ్రవరి 25 శ్రీలంక vs న్యూజిలాండ్ గ్రూప్ 2 కొలంబో రాత్రి 7:00
ఫిబ్రవరి 26 వెస్టిండీస్ vs సౌతాఫ్రికా గ్రూప్ 1 అహ్మదాబాద్ మధ్యాహ్నం 3:00
ఫిబ్రవరి 26 భారత్ vs జింబాబ్వే గ్రూప్ 1 చెన్నై రాత్రి 7:00
ఫిబ్రవరి 27 ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ గ్రూప్ 2 కొలంబో రాత్రి 7:00
ఫిబ్రవరి 28 శ్రీలంక vs పాకిస్థాన్ గ్రూప్ 2 క్యాండీ రాత్రి 7:00
మార్చి 1 సౌతాఫ్రికా vs జింబాబ్వే గ్రూప్ 1 ఢిల్లీ మధ్యాహ్నం 3:00
మార్చి 1 భారత్ vs వెస్టిండీస్ గ్రూప్ 1 కోల్‌కతా రాత్రి 7:00
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications