
అక్టోబర్ 23న అసలు టోర్నీ
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. మెగా టోర్నీ యూఏఈతో పాటు ఒమన్‌లో నిర్వహించనున్నట్లు ఐసీసీ అప్పటికే ప్రకటించింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో మెగా టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సి వచ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ఈ టోర్నీ మొత్తం జరుగనుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఆడనున్నాయి.

అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మ్యాచ్
ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్ 2లో ఇండియాతో పాటు పాకిస్తాన్, న్యూజీలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. రౌండ్ 1లో అర్హత పొందిన మరో రెండు జట్లు కూడా చేరనున్నాయి.
పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను ఓడిస్తే.. భారత్ సునాయాసంగా సెమీస్ చేరనుంది. మరోవైపు గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్ సహా మరో రెండు జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు క్వాలిఫైర్ మ్యాచులు ఆడనున్నాయి.
సూపర్12కు నాలుగు టీమ్‌లు
మెగా టోర్నీలో భాగంగా మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం (అబుదాబి), షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. కాగా టోర్నమెంట్ తొలి రౌండ్‌లో అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒమన్, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్‌లు సూపర్12కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్‌తో కలుస్తాయి.

యూఏఈలోనే ఐపీఎల్
ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే పొట్టి కప్‌కు ముందు బీసీసీఐ నిర్వహించనుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ 14 మ్యాచులు జరగనున్నాయి. ఐపీఎల్ అనంతరం అక్టోబర్ 17న టీ20 ప్రపంచకప్ క్వాలిఫైర్ మ్యాచులు ఆరంభం అవుతాయి. అవన్నీ ఒమన్ వేదికగా జరగున్నాయి కాబట్టి.. ఆలోపు ప్రపంచకప్ కోసం యూఏఈలో పిచ్‌లు సిద్ధం చేస్తారు. ఐపీఎల్ కోసం వచ్చిన ఆటగాళ్లు మెగా టోర్నీ కోసం యూఏఈలోనే ఉండనున్నారు.


Click it and Unblock the Notifications

IND vs ENG: ఎంఎలండన్: మాజీ కెప్టెన్స్ ధోనీ సారథ్యంలోని ఆ విజయం కంటే.. ఇది మాకెంతో ప్రత్యేకమైనది: విరాట్ కోహ్లీ










