Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC T20 Rankings: రాహుల్‌ 3.. కోహ్లీ 8

ICC T20 Rankings: Virat Kohli, KL Rahul jumps one position after series win over australia

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. రాహుల్ మూడో స్థానంలో నిలువగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.

ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి టాప్-10లో ఇద్దరికే చోటు దక్కింది. కాన్‌బెర్రా వేదికగా జరిగిన మొదటి టీ20లో రాహుల్‌ అర్ధశతకంతో రాణించిన విషయం తెలిసిందే.

సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన రాహుల్‌ ఒక స్థానాన్ని మెరుగుపరచుకొని మూడో స్థానానికి ఎగబాకాడు. ఆఖరి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విరాట్‌(85) ఒక ర్యాంకు మెరుగుపరచుకొని ఎనిమిది స్థానంలో నిలిచాడు.

డేవిడ్‌ మలన్‌(ఇంగ్లాండ్‌) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా బాబర్‌ అజామ్‌(పాకిస్థాన్‌) రెండో ర్యాంకులో ఉన్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో భారత్‌ నుంచి ఒక్క బౌలర్‌ కూడా టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక ఈ సిరీస్‌లో రాణించి ఆడమ్ జంపా రెండు ర్యాంకు మెరుగుపరుచుకొని నాలుగో స్థానంలో నిలిచాడు.

Story first published: Wednesday, December 9, 2020, 17:26 [IST]
Other articles published on Dec 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+