Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాట్స్‌మెన్ బౌలింగ్‌పై ఫన్నీ మీమ్‌తో ఐసీసీ సెటైర్స్!

 ICC Shares Hilarious Meme On How Batsmen Think They Bowl vs How Batsmen Bowl

న్యూఢిల్లీ: అప్పుడప్పుడూ పార్ట్ టైమ్ బౌలర్లుగా బ్యాట్స్‌మెన్ వేసే బౌలింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వ్యంగ్యస్త్రాలు సంధించింది. వారు వేయాలనుకున్నది, చివరకు వేసేంది పోలుస్తూ ఫన్నీ మీమ్‌ను ట్విటర్ వేదికగా షేర్ చేసింది. బ్యాట్స్‌మెన్ అంతా బంతిని అందుకోగానే ఈఫిల్ టవర్‌లా బౌలింగ్ చేయాలనుకుంటారని, కానీ చివరకు వారి వేసిన బంతి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ టవర్‌లా మారుతుందని పేర్కొంది.

ఇక ఈ ఫన్నీ మీమ్‌పై అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు. ఇది విరాట్ కోహ్లీని ఉద్దేశించి చేసిందే కదా! అని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ విరాట్ 28 పరుగులిచ్చాడు. చెన్నై బ్యాట్స్‌మెన్ 4,6,4,6,2,6తో విరాట్‌ను మళ్లీ బౌలింగ్ చేయకుండా చేశాడు. ఐసీసీ తాజా ట్వీట్‌తో అభిమానులు తమకు ఇదే గుర్తొచ్చిందని కామెంట్ చేస్తున్నారు. అలాగే పాకిస్థాన్ ఆట, పీఎస్‌ఎల్ నిర్వహించే తీరు ఈ ట్వీట్‌లానే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు.

కరోనాతో ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్ ఇంగ్లండ్ చొరవతో మళ్లీ పట్టాలెక్కింది. వెస్టిండీస్, పాకిస్థాన్‌తో బయోబబుల్ వాతావరణంలో ఇంగ్లండ్ సక్సెస్‌ఫుల్‌గా టోర్నీలను నిర్వహించింది. ఇంగ్లండ్‌ను స్పూర్తిగా తీసుకున్న బీసీసీఐ కూడా ఐపీఎల్ 2020 సీజన్‌ను ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. ఇక ఇన్నాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవని బాధపడిన క్రికెట్ అభిమానులకు నవంబర్ 27న ట్రిపుల్ ధమాకా లభించనుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా ఫస్ట్ వన్డే, వెస్టిండీస్‌తో న్యూజిలాండ్ తొలి టీ20, సౌతాఫ్రికాతో ఇంగ్లండ్ మొదటి టీ20 ఆడనున్నాయి.

ఇప్పటికే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా బయో బబుల్‌ను దాటకుండా తమకు ఇచ్చిన వెసులు బాట్లను ఉపయోగించుకుంటూ ప్రాక్టీస్ షురూ చేసింది. రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో ఆసీస్‌తో భారత్‌ 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది.

Story first published: Monday, November 16, 2020, 10:02 [IST]
Other articles published on Nov 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+