మండిపడ్డ ఫ్యాన్స్: స్టోక్స్‌తో పోల్చి సచిన్‌ను తక్కువ చేస్తూ ఐసీసీ ట్వీట్

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరోసారి కవ్వించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో బెన్ స్టోక్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో దాదాపు అసాధ్యమైన 359 పరుగుల లక్ష్య ఛేదనలో, అది కూడా 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో తన అసమాన పోరాటంతో ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
ఒంటరిగా వదిలేయండి: ధోని అంతటి కీర్తిని మరెవరైనా సంపాదించారా?
ఈ నేపథ్యంలో మరోసారి బెన్ స్టోక్స్‌ను సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ ఐసీసీ చేసిన ట్వీట్ సచిన్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ 84 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లాండ్ తొలిసారి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహారించాడు.
సచిన్ చేతుల మీదుగా అవార్డు
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను బెన్ స్టోక్స్ అనంతరం నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని ఐసీసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "ది గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్‌టైమ్‌తో సచిన్ టెండూల్కర్" అంటూ కామెంట్ పెట్టింది.
మండిపడ్డ సచిన్ అభిమానులు
అప్పట్లో ఈ ట్వీట్‌పై సచిన్ అభిమానులు మండిపడ్డారు. తాజాగా లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో సెంచరీ సాధించి బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్‌ను గెలిపించడంతో సచిన్ టెండూల్కర్‌తో కలిసి దిగిన వరల్డ్‌కప్ ఫోటోను రీట్వీట్ చేస్తూ "ముందే చెప్పాగా?" అంటూ బుధవారం మరో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్గి రాజేసింది.
ఐసీసీ ట్వీట్‌పై సచిన్ అభిమానులు
ఐసీసీ ట్వీట్‌పై సచిన్ అభిమానులు మండిపడుతున్నారు. "సిగ్గుగా ఉంది. సచిన్‌తో పోలిక? అతడొక లెజెండ్.. మీరు ఏమైనా సాధించొచ్చు గాక.. ప్రవర్తన అనేది ఇక్కడ ఎంతో ముఖ్యం" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మరొక నెటిజన్ "నీ మాటలతో ఏకీభవిస్తున్నా. సచిన్ ఒక క్రికెటర్ కాదు... అతడు క్రికెట్‌కే దేవుడు" అంటూ ట్వీట్ చేశాడు.
20 శాతం కూడా సాధించలేదు
ఇంకొక నెటిజన్ అయితే "అవును, కనీసం 20 శాతం కూడా సాధించిన వారిని నువ్వు ఆల్ టైమ్ గ్రేట్ అని అంటున్నావు. ఇక పాకిస్థాన్ హ్యాండ్లర్ నుంచి ఏం ఆశిస్తావో! ఇంకా నయం బౌలింగ్‌తో పోల్చలేదు" అంటూ ట్వీట్ చేశాడు. మరొక నెటిజన్ అయితే "ఒకరేమో టెస్టుల్లో 54 యావరేజితో 15,921 పరుగులు.. వన్డేల్లో 45 యావరేజితో 18426. ఇంకొకరు టెస్టుల్లో 35 యావరేజితో 3479... వన్డేల్లో 40 యావరేజితో 2628 పరుగులు. ఇక, సెంచరీలు గురించి మాట్లాడుకుందామా?" అంటూ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications