పాకిస్థాన్‌పై ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్.. అయినా భారత్‌కు తప్పని ఘోర పరాజయం!

దుబాయ్: సరిగ్గా 15 ఏళ్ల క్రితం (2006 జనవరి 29) ఇదే రోజు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టెస్ట్‌ల్లో హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఫస్ట్ ఓవర్‌లోనే ఈ ఘనతను అందుకున్నాడు. తద్వారా సంప్రదాయక ఫార్మాట్‌లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా పఠాన్ చరిత్రకు ఎక్కాడు. ఇక ఈ అద్భుత క్షణాన్ని గుర్తు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నాటి ఫొటోను అభిమానులతో పంచుకుంది.'2006లో ఇదే రోజు ఓ టెస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా ఇర్ఫాన్ పఠాన్ రికార్డు సృష్టించాడు.'అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.

2006 పాకిస్థాన్ పర్యటనలో..
రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని భారత జట్టు 2006లో పాకిస్థాన్‌లో పర్యటించగా.. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో పఠాన్ ఈ ఘనతను అందుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు పఠాన్ అదిరిపోయే శుభారంభం ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే ప్రమాదకర సల్మాన్ భట్, యూనీస్‌ఖాన్, మహ్మద్ యూసుఫ్‌ను పెవిలియన్ చేర్చాడు. తొలుత ఓపెనర్‌గా వచ్చిన భట్ స్లిప్‌లో రాహుల్ ద్రవిడ్ చేతికి చిక్కగా, తర్వాతి బంతికే యూనిస్ ఎల్బీగా వెనుతిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన యూసుఫ్ బౌల్డవ్వడంతో పఠాన్ హ్యాట్రిక్ వికెట్ అందుకున్నాడు.

భారత్‌కు ఘోర పరాజయం..
ఇక అదే రోజు పాకిస్థాన్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అబ్దుల్ రజాక్(45), కమ్రన్ అక్మల్(113), షోయబ్ అక్తర్(45) రాణించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా 238 పరుగులు చేయగా, పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 599/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆపై భారత్ 265 పరుగులకే ఆలౌటై 341 పరుగుల భారీ ఓటమి చవిచూసింది.

కామెంటేటర్‌గా..
ఈ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్‌ఇండియా ఓటమిపాలైనా ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ చిరస్థాయిలో నిలిచిపోయింది. కాగా, పఠాన్ టీమ్‌ఇండియా తరఫున కొద్దికాలమే ఆడినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. గతేడాది జనవరి 4న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రికెట్ కామెంట్రీతో పాటు విశ్లేషకుడిగా తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications