23 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికాలో వన్డే ప్రపంచకప్.. ఫార్మాట్ రూల్స్, వేదికల జాబితా ఇదే!
వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి సంబంధించిన 12 వేదికల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
ఈ వన్డే సిరీస్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ 57 మ్యాచ్‌లు 12 వేదికల్లో జరగనున్నాయి. ఇందులో సౌతాఫ్రికాలో 8 వేదికలు, జింబాబ్వేలో 3, నమీబియాలో ఒక వేదికను ఐసీసీ ఖరారు చేసింది.

స్టేడియాల పూర్తి వివరాలు..
సౌతాఫ్రికా
1. వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్
2. సెంచూరియన్, ష్వాన్
3. న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్
4. కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్
5. సెయింట్ జార్జ్ పార్క్, కిబెరా
6. మాంగాంగ్ ఓవల్, బ్లూమ్‌ఫోంటైన్
7. బోలాండ్ పార్క్, పార్ల్
8. బఫ్ఫ్‌లో పార్క్
జింబాబ్వే
9. హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
10. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులావాయో 11. ఫాల్ మోషి-ఓవా-దున్యా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, విక్టోరియా ఫాల్స్
నమీబియా
12. నమీబియా క్రికెట్ స్టేడియం, విండ్‌హోక్
నమీబియా చరిత్రలోనే తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ అతిథ్యం ఇస్తోంది. 2003 వన్డే ప్రపంచకప్‌ను సౌతాఫ్రికా, జింబాబ్వే సంయుక్తంగా విజయవంతంగా నిర్వహించాయి.
వరల్డ్ కప్ నయా రూల్స్..
2027 వన్డే ప్రపంచకప్ కోసం పూర్తిగా కొత్త ఫార్మాట్‌ను ప్రవేశపెట్టారు. కొత్తగా సూపర్ సిరీస్, సూపర్ 7 వంటి రౌండ్లను చేర్చారు.
సూపర్ సిరీస్ క్వాలిఫయర్స్: అంతర్జాతీయ వన్డేల్లో 12 నుంచి 14వ ర్యాంకుల్లో ఉన్న జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించడానికి సూపర్ సిరీస్ క్వాలిఫయర్స్‌లో ఆడుతాయి. ఇందులో గెలిచిన ఒక జట్టు మాత్రమే ప్రపంచకప్ లీగ్ దశకు అర్హత సాధిస్తుంది.
లీగ్ రౌండ్: ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతీ గ్రూప్‌లో 6 జట్లు ఉంటాయి. తమ గ్రూప్‌లో ఇతర జట్లతో ఒక్కోసారి తలపడుతాయి. ఇలా లీగ్ దశలో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతీ గ్రూప్ నుంచి టాప్ -3 టీమ్స్.. అలాగే రెండు గ్రూప్‌ల్లో కలిపి మెరుగైన ప్రదర్శన కనబర్చి మరో జట్టు సూపర్-7 దశకు అర్హత సాధిస్తోంది.
సూపర్ 7: సూపర్ 7లో రౌండ్ రాబిన్ పద్దతిలో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సూపర్-7 పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన టాప్-4 టీమ్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన టీమ్‌తో తొలి సెమీఫైనల్ ఆడుతోంది. రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన టీమ్‌తో రెండో సెమీఫైనల్ ఆడుతోంది. సెమీస్‌లో గెలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

