Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంపైర్‌ను బూతులు తిట్టిన ఆరోన్ ఫించ్.. నిషేధం విధిస్తామని ఐసీసీ వార్నింగ్! (వీడియో)

ICC reprimands Australia skipper Aaron Finch for abusing umpire

సిడ్నీ: కీలక టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. ఉద్దేశ పూర్వకంగా క్యాచ్ పట్టకుండా ఫీల్డర్‌ను మాథ్యూవేడ్ అడ్డుకోగా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంపైర్‌పై నోరుపారేసుకున్నాడు. ప్రపంచకప్ ముందు సన్నాహకంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లు ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. మాథ్యూ వేడ్ తొండాటపై సర్వత్రా విమర్శలు రాగా.. ఆరోన్ ఫించ్‌పై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి చర్యలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.

అసలేం జరిగిందంటే..?

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆసీస్ బౌలర్ కామెరూన్ గ్రీన్ వేసిన 9వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని బట్లర్ ఇన్‌సైడ్ ఎడ్జ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి కాస్తా మిస్ అయి వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆసీస్ ఆటగాళ్లు మాత్రం బంతి బ్యాట్ కు తాకిందనే భావనతో అంపైర్ కు అప్పీల్ చేశారు.

కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. డీఆర్ఎస్ తీసుకోవడానికి 14 సెకన్ల సమయముండగా ఆ కొద్దిపాటి క్షణాల్లో ఫించ్, వేడ్, ఇతర ఆటగాళ్లు చర్చించేసరికి టైమ్ గడిచింది. దీంతో అంపైర్ టైమ్ అయిపోయిందని ఫించ్ కు చెప్పాడు. కానీ ఫించ్ మాత్రం అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. రాయలేని బూతు పదాలను ఉపయోగించాడు. ఇదంతా స్టంప్ మైక్ లో రికార్డవ్వగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తప్పు అంగీకరించడంతో..

తప్పు అంగీకరించడంతో..

ఫించ్ అభ్యతంరకర వ్యాఖ్యలకు సంబంధించిన ఫుటేజీని పరిశీలించిన మ్యాచ్ రిఫరీ.. అతడు లెవల్-1 నిబంధనలను ఉల్లంఘించినట్టు తెలిపాడు. ఆర్టికల్ 2.3 కోడ్ ఆఫ్ కండక్ట్ కింద.. అంతర్జాతీయ మ్యాచ్‌లో అసభ్యకర వ్యాఖ్యలను చేయడం నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుంది. అయితే ఫించ్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో ఎలాంటి జరిమానా విధించకుండా హెచ్చరికతో వదిలిపెడుతున్నట్టు రిఫరీ పేర్కొన్నాడు. ఇది మళ్లీ రిపీట్ అయితే మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

 వేడ్ తొండాట..

వేడ్ తొండాట..

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో మార్క్ వుడ్ వేసిన బంతిని.. మాథ్యూ వేడ్ హిట్ చేయగా బంతి గాల్లోకి లేచింది. అయితే వేడ్ బంతిని గమనించలేదు. అతను సింగిల్ కోసం పిచ్ నుంచి బయటికొచ్చాడు. అయితే మార్క్ వుడ్ గాల్లోకి లేచిన బంతిని అందుకునేందుకు ముందుకు పరిగెత్తుకుంటూ రాగా.. వేడ్ చేత్తో అడ్డుకున్నాడు. దీంతో క్యాచ్ మిస్సయ్యింది. మార్క్ వుడ్‌తో సహా ఇంగ్లండ్ ప్లేయర్లందరు షాకయ్యారు. వాళ్లు అంపైర్ల మొహం చూశారు. కానీ పెద్దగా అప్పీలు చేయలేదు. అంపైర్లు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను అప్పీలు గురించి అడగగా... తాము అప్పీలు చేయట్లేదని బట్లర్ పేర్కొన్నాడు. దీంతో అంపైర్లు వేడ్‌ను ఔట్‌గా ప్రకటించలేదు.

ఎన్ని చేసినా గెలవలేదు..

ఎన్ని చేసినా గెలవలేదు..

ప్రపంచకప్ ముందు వివాదాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడవద్దని తాను అప్పీల్ చేయలేదని బట్లర్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 8 పరుగులతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (68), అలెక్స్ హేల్స్ (84) లు రాణించారు. అనంతరం ఆసీస్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగుల వద్దే ఆగిపోయింది. డేవిడ్ వార్నర్ (73) పోరాడినా ఆసీస్ కు ఓటమి తప్పలేదు. ఈ రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్ అక్టోబర్ 12న కాన్‌బెర్రాలో జరుగుతుంది.

Story first published: Tuesday, October 11, 2022, 15:21 [IST]
Other articles published on Oct 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+