For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. ఐసీసీ ట్వీట్!

 ICC recalls MS Dhonis sweet gesture for Virat Kohli in 2014 T20 World Cup semi-final against South Africa

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మంచి ఫినిషర్‌ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో సిక్స్‌తో 28 ఏళ్ల కలను సాకారం చేసిన క్షణం ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. ఆ ఒక్క మ్యాచే కాదు.. మరెన్నో మ్యాచ్‌ల్లో మహీ తనదైన ఫినిషింగ్‌తో మ్యాచ్‌లను పూర్తి చేశాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరిబంతికి విన్నింగ్‌ షాట్‌ కొట్టి భారత అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాడు. అలాంటి ధోనీ ఒకసారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ఓ చిన్నపాటి త్యాగం చేశాడు. ఆ వీడియోను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) తాజాగా ట్విటర్ వేదికగా పంచుకుంది.

2014 టీ20 ప్రపంచకప్‌లో..

ధోనీ 2013లో భారత జట్టును ఛాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలబెట్టగా.. 2014 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌ వరకూ తీసుకెళ్లాడు. అక్కడ లంక చేతిలో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్‌లో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. అదే కోహ్లీ కోసం ధోనీ త్యాగం చేయడం. సెమీఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 172/4 స్కోర్‌ సాధించింది.

 విన్నింగ్ షాట్ త్యాగం..

విన్నింగ్ షాట్ త్యాగం..

అనంతరం కోహ్లీ ( 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 నాటౌట్‌) అర్ధశతకంతో రెచ్చిపోవడంతో భారత్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆ మ్యాచ్‌ 19 ఓవర్లకే పూర్తి అవ్వాల్సి ఉన్నా చివరి ఓవర్‌ వరకూ వెళ్లిందంటే కారణం ధోనీనే. బ్యూరన్‌ హెన్రిక్స్‌ వేసిన 18.5వ బంతికి కోహ్లీ సింగిల్‌ తీయడంతో టీమిండియా స్కోరు 172.. సౌతాఫ్రికాతో సమం అయింది. తర్వాతి బంతికి ధోనీ ఒక పరుగు తీస్తే భారత్‌ విజయం సాధిస్తుందనగా డిఫెన్స్‌ ఆడి వదిలేశాడు.

 బ్రో ఎందుకు.. నీ కోసమే బ్రో

బ్రో ఎందుకు.. నీ కోసమే బ్రో

మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ అది చూసి నవ్వుకున్నాడు. అలా ఎందుకు చేశావని కెప్టెన్‌ను చూస్తూ సైగలు చేశాడు. అయితే, కోహ్లీ అప్పటికే 68 పరుగులతో ఉండడంతో.. విన్నింగ్‌ షాట్‌ కూడా అతడే కొట్టాలని ధోనీ భావించాడు. దీంతో డేల్‌స్టెయిన్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతిని కోహ్లీ ఫోర్‌గా మలిచి జట్టును గెలిపించాడు. ఆ వీడియోనే ఐసీసీ తాజాగా ట్విటర్‌లో పంచుకుంది.

Story first published: Thursday, December 24, 2020, 17:06 [IST]
Other articles published on Dec 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+