Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Rankings: ఇంగ్లండ్ బౌలర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్.. కోహ్లీ, రోహిత్ ర్యాంకులు పదిలం!

ICC Rankings: Virat Kohli and Rohit Sharma holds on to his spots, KL Rahul rises in T20s
ICC Rankings : Virat Kohl & Rohit Sharma Move Up In Latest ICC T20I Rankings || Oneindia Telugu

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌.. కెరీర్‌ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 6 వికెట్లతో రాణించిన వోక్స్‌(711 పాయింట్లు).. ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(737 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లా బౌలర్‌ మెహదీ హసన్‌ (713) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత యార్కర్ల కింగ్ జస్ప్రీత్‌ బుమ్రా (690 పాయింట్లు) ఒక స్థానాన్ని కోల్పోయి ఆరో ప్లేస్‌కు దిగజారాడు.

టాప్‌లో బాబర్ ఆజామ్..

టాప్‌లో బాబర్ ఆజామ్..

ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే.. శ్రీలంకతో సిరీస్‌లో 147 పరుగులతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ జో రూట్‌.. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానంలో, వన్డే కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఒక స్థానం ఎగబాకి 25వ ప్లేస్‌లో నిలిచారు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ(857), రోహిత్‌ శర్మ(825) వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకోగా, పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌(865) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ వన్డే సిరీస్‌ ఆడకుండా చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో అగ్రస్థానం కోల్పోయిన కోహ్లీ.. రెండో స్థానాన్ని మాత్రం నిలబెట్టుకున్నాడు.

భారత్ నుంచి ఒక్కడే..

భారత్ నుంచి ఒక్కడే..

ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ స్టార్ షకీబ్ ఉల్ హసన్(387) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మహ్మద్ నబీ(294), క్రిస్ వోక్స్(290), బెన్ స్టోక్స్( 286), రషీద్ ఖాన్(270) వరుసగా టాప్-5లో ఉన్నారు. భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 245 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా 226 రేటింగ్ పాయింట్స్‌లో 13వ స్థానంలో ఉన్నాడు.

కోహ్లీ 5.. రాహుల్ 6

కోహ్లీ 5.. రాహుల్ 6

ఇక టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో వెస్టిండీస్ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ ఒక స్థానం మెరుగుపర్చుకుని 9వ ప్లేస్‌కు చేరుకోగా, సౌతాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్‌ మర్‌క్రమ్‌లు.. 13, 19వ స్థానాలకు ఎగబాకారు. విండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఈ ఇద్దరు ఓపెనర్లు అదరగొట్టారు. దీంతో సౌతాఫ్రికా.. ఆతిధ్య జట్టుపై 3-2తో సిరీస్ గెలుపొందింది. ఈ జాబితాలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం ఒక స్థానం మెరుగుపరుచుకని 6వ ప్లేస్‌కు చేరుకోగా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ ప్లేయర్‌ డేవిడ్‌ మలాన్, ఆసీస్‌ ఆరోన్‌ ఫించ్‌, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌లు వరుసగా 1, 2, 3 స్థానాలను నిలబెట్టుకున్నారు.

Story first published: Wednesday, July 7, 2021, 19:26 [IST]
Other articles published on Jul 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+