Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Rankings: కోహ్లీని వెనక్కినెట్టిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ ర్యాంక్ ఎంతంటే.?

ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాప్ లేపాడు. అఫ్గానిస్థాన్‌తో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన గిల్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకును అందుకున్నాడు.

ఈ సిరీస్‌లోని తొలి రెండు వన్డేల్లో శుభ్‌మన్ గిల్ 84, 154 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శుభ్‌మన్ గిల్ కంటే అతనికి కేవలం 24 రేటింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్.. విరాట్ కోహ్లీని వెనక్కినెట్టాడు. తొడకండరాల గాయంతో అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోగా.. రోహిత్ శర్మ నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు.

అతని కాళ్లు మొక్కి టీమిండియా జెర్సీ అందుకున్న బుడ్డోడు! (వీడియో)

అతని కాళ్లు మొక్కి టీమిండియా జెర్సీ అందుకున్న బుడ్డోడు! (వీడియో)

21 స్థానాలు ఎగబాకిన ఇషాన్ కిషన్..

టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఏకంగా 21 స్థానాలు దూసుకొచ్చి 43వ ర్యాంకు సాధించగా, శ్రేయస్ అయ్యర్ 14వ స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్ రెండు స్థానాలు దిగజారి 11వ స్థానానికి పరిమితమయ్యాడు. బౌలింగ్‌ విభాగంలోనూ టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 16 స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానాన్ని అందుకోగా.. ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 34 స్థానాలు ఎగబాకి 58వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 71వ స్థానంలో నిలిచాడు.

ICC Rankings Shubman Gill Surpasses Virat Kohli to Grab No 2 ODI Spot Joe Root Reclaims World No 1 Test Ranking

మరోవైపు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ నెంబర్ 1 బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ అగ్రస్థానం కోల్పోయి రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో జో రూట్ 14వేల పరుగుల మైలురాయి అందుకున్న సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ఏకైక బ్యాటర్‌గా జోరూట్ నిలిచాడు.

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం! జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఎలా చూడాలంటే?

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం! జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఎలా చూడాలంటే?

మ్యాట్ హెన్రీ అరుదైన ఘనత..

మరోవైపు టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 11 వికెట్లతో చెలరేగి కివీస్ 253 పరుగుల భారీ విజయం సాధించడంలో మ్యాట్ హెన్రీ కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో హెన్రీ టెస్టుల్లో నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. కివీస్ క్రికెట్ చరిత్రలో జాక్ కౌవీ, రిచర్డ్ హాడ్లీల తర్వాత 36 ఏళ్లకు టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకు సాధించిన మూడో ఫాస్ట్ బౌలర్‌గా 34 ఏళ్ల మ్యాట్ హెన్రీ రికార్డు సాధించాడు.

Story first published: Wednesday, June 24, 2026, 17:11 [IST]
Other articles published on Jun 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+