For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Rankings: టాప్‌లేపిన హైదరాబాద్ కుర్రాడు!

దుబాయ్: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బౌలర్‌గా ఈ హైదరాబాద్ పేసర్ నిలిచాడు. ఆసియాకప్ 2023 ఫైనల్లో సంచలన ప్రదర్శనతో ప్రపంచ రికార్డులను నమోదు చేసిన సిరాజ్.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా పేసర్ జోషల్ హజెల్ వుడ్‌ను వెనక్కినెట్టి 694 రేటింగ్ పాయింట్స్‌తో నెంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఆసియాకప్ ఫైనల్ ముందు 9వ ర్యాంక్‌లో నిలిచిన సిరాజ్.. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో చెలరేగి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. సిరాజ్ ధాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.

Mohammed Siraj becomes world number one ODI bowler, jumps 8 spots

మొత్తం 7 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 21 పరుగులే ఇచ్చి 6 వికెట్లతో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ నమోదు చేశాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు సిరాజ్ సిద్దమవ్వగా.. ఫిజియోల సూచనలతో రోహిత్ శర్మ అతన్ని అడ్డుకున్నాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో సిరాజ్‌ను తానే అడ్డుకున్నానని రోహిత్ శర్మ మీడియా సమావేశంలో వెల్లడించాడు.

లేకుంటే సిరాజ్ మరిన్ని వికెట్లు తీసేవాడు. ఆసియాకప్ విజయంతో మంచి జోష్‌లో ఉన్న టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు సిద్దమవుతోంది. శుక్రవారం మొహాలీ వేదికగా తొలి వన్డే జరగనుంది.

Mohammed Siraj becomes world number one ODI bowler, jumps 8 spots

వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఈ మూడు వన్డేల సిరీస్‌ ఇరుజట్లకు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. మెగా టోర్నీ నేపథ్యంలో తమ బలబలాలు, బలహీనతలను పరీక్షించుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు సీనియర్ ఆటగాళ్లను టీమిండియా మేనేజ్‌మెంట్ దూరం పెట్టింది.

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా, స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్‌లకు విశ్రాంతినిచ్చింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకున్న టీమ్‌మేనేజ్‌మెంట్.. వాషింగ్టన్ సుందర్‌తో పాటు బెంచ్ ఆటగాళ్లందరినీ తొలి రెండు వన్డేలకు ఎంపిక చేసింది.

Story first published: Wednesday, September 20, 2023, 14:35 [IST]
Other articles published on Sep 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+