Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Rankings: అగ్రస్థానంలో టీమిండియా..!

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వార్షిక టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా దుమ్మురేపింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా.. టెస్ట్‌ల్లో మాత్రం రెండో స్థానానికి పరిమితమైంది. నెల రోజుల క్రితం వరకు మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా.. ఈ ఫీట్ సాధించిన జట్టు‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

తాజా ర్యాంకింగ్స్‌లో మాత్రం టీ20, వన్డేల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. టెస్ట్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. టీ20ల్లో 264 రేటింగ్ పాయింట్స్‌తో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా(257) ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని రెండో స్థానంలో నిలవగా.. ఇంగ్లండ్(252), సౌతాఫ్రికా(250), న్యూజిలాండ్(250), వెస్టిండీస్(249) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ICC Rankings India Retain T20I And ODI Crown Lose Top Spot In Test Rankings

పాకిస్థాన్ రెండు స్థానాలను కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయింది. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఈ మెగా టోర్నీ అనంతరం ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఐసీసీ వ్యక్తిగత టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్(861) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా... ఫిల్ సాల్ట్(802), మహమ్మద్ రిజ్వాన్(784), బాబర్ ఆజామ్(763), ఎయిడెన్ మార్‌క్రమ్(755) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వన్డే ఫార్మాట్‌లో భారత్ 122 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా(116), సౌతాఫ్రికా(112), పాకిస్థాన్(106), న్యూజిలాండ్(101) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. టెస్ట్ ఫార్మాట్‌లో 124 రేటింగ్ పాయింట్స్‌తో ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా.. భారత్(120), ఇంగ్లండ్, సౌతాఫ్రికా(103), న్యూజిలాండ్(93) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Story first published: Friday, May 3, 2024, 20:40 [IST]
Other articles published on May 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+