Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి బాధలో ఉన్న పాక్‌కు బిగ్ షాక్.. ఆ ఇద్దరిపై ఐసీసీ చర్యలు!

ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. నిబంధనలను అతిక్రమించిన పాకిస్థాన్ ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టీండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ 90 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అత్యుత్సాహం ప్రదర్శన పాకిస్థాన్ పేసర్లు ఖుర్రమ్ షెహ్‌జాద్, మహమ్మద్ అబ్బాస్‌లపై ఐసీసీ చర్యలు తీసుకుంది.

WTC 2025-27: ఘోర పరాజయంతో పాతాళానికి పాక్.. భారత్ స్థానం ఏంటంటే..?

WTC 2025-27: ఘోర పరాజయంతో పాతాళానికి పాక్.. భారత్ స్థానం ఏంటంటే..?

వెస్టిండీస్ బ్యాటర్ షైహోప్ ఔట్ చేసిన అనంతరం ఖుర్రమ్ షెహ్‌జాద్ అత్యుత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. అతని మీదకు దూసుకెళ్లాడు. ఈ చర్యను తప్పుబట్టిన మ్యాచ్ రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించాడు.

ICC Punishes Pakistan Players For Unsporting Behavior After 90 Run Loss To West Indies In 1st Test
Photo Credit: X (twitter)

తప్పును అంగీకరించడంతో..

వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో జోమెల్ వారికన్‌ను ఆఖరి వికెట్‌గా ఔట్ చేసిన మహమ్మద్ అబ్బాస్ కూడా అత్యుత్సాహంతో సంబరాలు చేసుకున్నాడు. అది అతను ఐదో వికెట్ కావడంతో ఓవరాక్షన్ చేశాడు. అయితే అబ్బాస్‌ను మందలింపుతో రిఫరీ వదిలేసాడు. ఈ ఇద్దరూ తమ తప్పిదాలను మ్యాచ్ రిఫరీ ముందు అంగీకరించారని ఐసీసీ పేర్కొంది.

'ఇద్దరు పాకిస్థాన్ ప్లేయర్లు తమ తప్పిదాలను అంగీకరించారు. మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ విధించిన శిక్షలపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దాంతో ఈ వ్యవహారంలో తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది.'అని ఐసీసీ పేర్కొంది.

ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. కెప్టెన్‌గా మారినా ఆట మాత్రం మారదు!

ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. కెప్టెన్‌గా మారినా ఆట మాత్రం మారదు!

పాతాళానికి పాక్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 282 పరుగులకు ఆలౌటైంది. 29 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన వెస్టిండీస్ 181 పరుగులకు ఆలౌటైంది. దాంతో పాక్ ముందు 211 లక్ష్యం నమోదు కాగా.. 120 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ పేసర్ జైడెన్ సీల్స్(5/20) ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.

విదేశాల్లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా 8వ ఓటమి. ఈ ఘోర పరాజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో పాకిస్థాన్ పాతాళానికి పడిపోయింది. ఈ డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్‌లో ఇప్పటి వరకు 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పాక్.. ఒకే ఒక్క విజయం, 6.66 విన్నింగ్ పర్సంటేజీతో అట్టడుగు స్థానంలో నిలిచింది.

అతను లేకపోవడంతో మేం సరైన భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. కొత్త బంతి స్వింగ్ అయ్యింది. వెస్టిండీస్ అద్భుతంగా బౌలింగ్ చేసి తమ పతనాన్ని శాసించింది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి మ్యాచ్‌లో పుంజుకునే ప్రయత్నం చేస్తాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, July 30, 2026, 19:03 [IST]
Other articles published on Jul 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+