ICC Player of the Month Award: రేసులో డేవిడ్ వార్నర్.. ఒక్క భారత ఆటగాడు లేడు!

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నవంబర్ నెలకు సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్స్‌ను ప్రకటించింది. ఈ అవార్డు రేసులో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాకిస్థాన్ ఓపెనర్ అబిద్ అలీ, న్యూజిలాండ్ పేసర్ టీమ్ సౌథీ నిలిచారు. ఈ ఏడాది జనవరి నుంచి కొత్తగా ఈ అవార్డును ప్రవేశపెట్టిన ఐసీసీ.. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను అంద జేస్తుంది. అందులో భాగంగానే నవంబర్ నెల కోసం టాప్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.

రేసులో వార్నర్..
టీ20 ప్రపంచకప్‌తో పాటు నవంబర్ నెలలో జరిగిన సిరీస్‌ల్లో సత్తా చాటిన ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేయగా.. పురుషుల కేటగిరీలో డేవిడ్ వార్నర్, పాకిస్థాన్ ఓపెనర్ అబిద్ అలీ, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలు చోటు దక్కించుకున్నారు. మహిళల కేటగిరీలో పాకిస్థాన్ క్రికెటర్ ఆనమ్ అమిన్, బంగ్లాదేశ్‌కు చెందిన నహీదా అక్తర్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హలే మథ్యూస్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఉన్నారు.

టీ20 ప్రపంచకప్‌లో..
డేవిడ్ వార్నర్ నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన కీలక సెమీఫైనల్లో 49 రన్స్ చేసిన వార్నర్.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 53 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. నవంబర్ నెలలో జరిగిన నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో 69.66 సగటుతో 209 రన్స్ చేశాడు. వార్నర్ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్ పేసర్ టీమ్ సౌథీ సైతం నవంబర్ నెలలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. డబ్ల్యూటీసీలో భాగంగా కాన్పూర్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సౌథీ 8 వికెట్లు తీశాడు.

రెండు ఇన్నింగ్స్‌ల్లో చెలరేగి..
టీ20 ప్రపంచకప్‌లో 7 వికెట్లతో టీమ్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక భారత్‌తో టీ20ల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. రేసులో ఉన్న పాకిస్థాన్ ఓపెనర్ అబిద్ అలీ డబ్ల్యూటీసీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 133, 91 పరుగులతో రెండు ఇన్నింగ్స్‌ల్లో రాణించాడు. నవంబర్ నెలలో భారత్ ఆటగాళ్లు తక్కువ మ్యాచ్‌లు ఆడటం.. పెద్దగా రాణించకపోవడంతో ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు.

ఓటింగ్ ద్వారా విజేత..
మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది.
ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన సభ్యులు ఉంటారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications