Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC ODI Rankings: దుమ్మురేపిన కోహ్లీ, రోహిత్

ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ దుమ్మురేపారు. వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఈ భారత్ త్రయం.. బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో నిలిచారు.

826 రేటింగ్ పాయింట్స్‌తో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకోగా.. 791 పాయింట్లతో విరాట్ కోహ్లీ మూడో స్థానం, 769 రేటింగ్ పాయింట్స్‌తో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

 ICC ODI Rankings: Virat Kohli closes in on regaining No. 1 spot

బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ పేసర్ ఓ స్థానం దిగజారి మూడో స్థానంలో నిలిచాడు. జస్‌ప్రీత్ బుమ్రా నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. కుల్దీప్ యాదవ్ ఏడు, మహమ్మద్ షమీ 10వ ర్యాంక్ అందుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఒక్కడే టాప్-10లో ఉన్నాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా గెలుచుకున్నాడు. రోహిత్ శర్మ 11 ఇన్నింగ్స్‌లతో 597 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.

ఈ టోర్నీలో వరుసగా 10 విజయాలు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక ఫైనల్లో మాత్రం ఓటమిపాలైంది. దాంతో మరోసారి టీమిండియా తృటిలో టైటిల్ చేజార్చుకుంది. పేలవ బ్యాటింగ్‌కు దురదృష్టం కూడా తోడవ్వడం టీమిండియా ఓటమిని శాసించింది.

Story first published: Wednesday, November 22, 2023, 19:56 [IST]
Other articles published on Nov 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+