Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC ODI Rankings: మళ్లీ అగ్రస్థానానికి పాకిస్థాన్..!

దుబాయ్: ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ 2023 టోర్నీ ముందు ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన పాకిస్థాన్.. 118 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ జట్టుగా నిలిచింది. ఈ ఏడాది మేలో ఫస్ట్ ర్యాంకులో ఉన్న పాకిస్థాన్‌ను ఆస్ట్రేలియా వెనక్కినెట్టింది.

ఇప్పుడు ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి పాకిస్థాన్ తిరిగి అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌ 113 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. టీ20, టెస్టుల్లో మాత్రం టీమిండియాదే అగ్రస్థానం. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ ముంగిట అగ్రస్థానాన్ని అందుకోవడం పాకిస్థాన్‌కు కలిసొచ్చే అంశం. అఫ్గాన్ని విజయం ఆ జట్టు ఆత్వవిశ్వాసాన్ని పెంచితే.. టాప్ ర్యాంక్ రెట్టింపు చేసింది.

ICC ODI Rankings: Pakistan claims No.1 after sweep series 3-0 vs Afghanistan

శనివారం ముగిసిన మూడో వన్డేల పాకిస్థాన్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక పాకిస్థాన్ నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవడంపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఆసియా కప్‌ కోసం ఉత్సహంగా ఎదురు చూస్తున్నాం. అఫ్గానిస్థాన్‌పై సిరీస్‌ విజయం మాకు కలిసొచ్చే అంశం.

కొంతమంది అనుకుంటున్నట్లు అఫ్గానిస్థాన్‌పై ఇదేమీ తేలిక విజయం కాదు. ఆ జట్టు స్పిన్‌ బలం గురించి అందరికి తెలిసిందే. ఈ గెలుపు ఆసియా కప్‌లో మాకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. నంబర్‌వన్‌ ర్యాంకు సాధించినప్పుడు సంతోషం, సంతృప్తి కలుగుతాయి. జట్టు సమష్టి కృషికి ఫలితమిది. ఇదే జోరును ఆసియాకప్‌లో కొనసాగిస్తాం'అని పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాం పేర్కొన్నాడు.

ఆసియా కప్ జట్టులో కీలక మార్పు:
ఆసియా కప్‌ 2023 కోసం మొదట ప్రకటించిన 17 మంది ఆటగాళ్ల జట్టులో పాకిస్థాన్‌ కీలక మార్పులు చేసింది. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో చివరి వన్డేలో ఆడిన మిడిలార్డర్‌ బ్యాటర్‌ సాద్‌ షకీల్‌ను ఆసియా కప్‌ జట్టులోకి తీసుకుంది. అంతకుముందు 2022 మార్చిలో చివరగా వన్డే ఆడిన అతను.. ఇప్పుడు అఫ్గాన్‌తో మూడో మ్యాచ్‌లోనూ 9 పరుగులే చేశాడు.

జట్టులోని తయ్యాబ్‌ తాహిర్‌ను రిజర్వ్‌ ఆటగాడిగా పాక్‌ మార్చింది. ఆసియా కప్‌లో బుధవారం తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో పాకిస్థాన్ తలపడనుంది. సెప్టెంబర్‌ 2న భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

Story first published: Monday, August 28, 2023, 10:38 [IST]
Other articles published on Aug 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+