ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజామ్ 824 రేటింగ్ పాయింట్స్‌తో తిరిగి నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్ అనంతరం బాబర్ ఆజామ్ వన్డేలు ఆడకపోయినా.. శుభ్‌మన్ గిల్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండటం అతనికి కలిసొచ్చింది.
ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(775) రేటింగ్ పాయింట్స్ తగ్గినప్పటికీ..తన మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రోహిత్ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కేశవ్ మహారాజ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. హజెల్ వుడ్, మహమ్మద్ సిరాజ్, ఆడమ్ జంపా, జస్‌ప్రీత్ బుమ్రా టాప్-5లో నిలిచారు. కుల్దీప్ యాదవ్ 8వ స్థానంలో కొనసాగుతుండగా.. మహమ్మద్ షమీ 11, రవీంద్ర జడేజా 22 స్థానాల్లో ఉన్నారు.
టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన అగ్రస్థానాన్ని కొల్పోయాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అతనికి ఆడే అవకాశం దక్కలేదు. దాంతో అతను రెండు స్థానాలు దిగజారి మూడో ప్లేస్‌కు పరిమితమయ్యాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సత్తా చాటిన ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో సూర్య విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన విషయం తెలిసిందే.
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్ నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతుండగా... బౌలర్‌గా అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. జడేజా 4, షమీ 18, సిరాజ్ 29వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్ టాప్-2లో నిలిచారు.