
ఆ మజా మిస్సవుతోంది..
మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడంతో పాటు క్యాచ్ ఔట్ స్ట్రైకింగ్ విషయంలో తీసుకొచ్చిన కొత్త చట్టంపై కొందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధన ప్రకారం బ్యాట్స్‌మన్ క్యాచ్ ఔటైతే.. కొత్తగా వచ్చే బ్యాటరే స్ట్రైకింగ్ తీసుకోవాలి. నాన్ స్ట్రైకర్ సగం దూరం పరుగెత్తుకొచ్చినా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఓవర్ పూర్తయితేనే కొత్తగా వచ్చే బ్యాట్స్‌మన్ నాన్ స్ట్రైకర్‌గా మారుతాడు. అయితే ఈ రూల్‌ను కొంత బంది ఆహ్వానిస్తే మరికొందరూ తప్పుబడుతున్నారు. ఇది క్రికెట్‌లో ఉన్న అసలు మజాను నాశనం చేస్తుందంటున్నారు.

చివరి ఓవర్‌లో..
ఉదహారణకు క్రీజులో శార్దూల్ ఠాకూర్‌తో పాటు రోహిత్ శర్మ ఉన్నాడనుకుందాం. విజయం కోసం చివరి 2 బంతులకు 4 పరుగులు కావాలి. స్ట్రైకింగ్‌లో ఉన్న శార్ధూల్ ఠాకూర్ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. తర్వాత బరిలోకి దిగే బ్యాట్స్‌మన్ మహమ్మద్ సిరాజ్ అనుకుంటే.. కొత్త నిబంధనల ప్రకారం అతనే బ్యాటింగ్ చేయాలి. అప్పుడు భారత్ విజయం కష్టం అవుతుంది. అదే పాత నిబంధన ప్రకారం రోహిత్ శర్మ స్ట్రైకింగ్ తీసుకుంటే చివరి బాల్‌కు ఫోర్ కొట్టి గెలిపిస్తాడు. అప్పుడు కలిగే థ్రిల్ వేరేలా ఉంటుంది. కానీ తాజా రూల్‌తో ఈ మజాను అభిమానులు కోల్పోనున్నారు.

బౌలర్లకు న్యాయం చేయాలంటే..
అయితే పూర్తిగా బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా మారిన క్రికెట్‌లో ఇలాంటి నిబంధనలు బౌలర్లకు మేలు చేస్తాయని సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు అంటున్నారు. ‘ఒక బ్యాట్స్‌మన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగినప్పుడు.. క్రీజులోకి కొత్త బ్యాటర్ రావాలనే నిర్ణయం కూడా బాగా నచ్చింది.
ఎందుకంటే.. ఒక బౌలర్ వికెట్ తీసి సక్సెస్ ట్రాక్‌లో ఉండడం సక్సెస్‌గా కనిపించినప్పుడు.. అతను కొత్త బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడం కూడా ఫెయిర్‌గానే కనిపిస్తుంది. ఈ కొత్త రూల్ బాగుంది.. వెల్‌డన్'అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు. అయితే బ్యాట్స్‌మన్ వల్లే క్రికెట్‌కు ఇంత క్రేజ్ అనే విషయం మర్చిపోవద్దని అభిమానులు అంటున్నారు.

మన్కడింగ్‌పై కూడా..
ఇక సచిన్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలు మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడాన్ని ఆహ్వానిస్తుంటే.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మాత్రం తప్పుబట్టాడు. అసలు క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ ఔట్ చేయడం అనేది ప్రత్యేకమైన స్కిల్ అని, మన్కడింగ్ చేయడంలో అదెక్కడ ఉందని ప్రశ్నించాడు. మన్కడింగ్ చేయడం ముమ్మాటికి అనైతికమేనని వాదించాడు.
ఇక భారత మాజీ ఆటగాళ్లు మాత్రం ముందు ఆ పేరును తొలగించి మని పనిచేశారంటున్నారు. 1948లో తొలిసారి భారత దిగ్గజం వినూ మన్కడ్.. ఆస్ట్రేలియా ఆటగాడు బిల్ బ్రౌన్‌ను ఇలా ఔట్ చేశాడు. దానికి ఆస్ట్రేలియా మీడియా మన్కడింగ్ అనే పేరు పెట్టింది. ఇంత కాలం అది ఐసీసీ క్రికెట్ చట్టాల్లోని అన్యాయమైన ఆట విభాగంలో ఉండేది. కానీ దీన్ని రనౌట్ కిందకు మారుస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications
