Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final డ్రా అయితే విన్నర్ ఎవరు? ఆటకు అంతరాయం కలిగితే పరిస్థితేంటి?

ICC mulls reserve day for WTC Final, decision on June 1

దుబాయ్‌: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ అరంగేట్ర ఎడిషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) దృష్టి సారించింది. కరోనా దెబ్బకు డబ్ల్యూటీసీ లీగ్ స్టేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. దాంతో ఫైనలిస్టులను తేల్చేందుకు పాయింట్స్ పర్సంటేజ్ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టింది.

దాని ప్రకారం టేబుల్ టాపర్స్ నిలిచిన భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరాయి. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే టైటిల్ ఫైట్‌లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మెగా ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విన్నర్ ఎవరు? ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒకట్రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోతే పరిస్థితేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఐసీసీ సిద్దమవుతోంది.

కండీషన్స్‌పై కసరత్తు

కండీషన్స్‌పై కసరత్తు

రిజర్వ్‌డే ఉంటుందని, డ్రా అయితే సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఇదివరకే ప్రకటించినా.. తాజాగా ఈ క్లాజ్‌ను తన వెబ్‌సైట్‌నుంచి తొలగించడంతో సందిగ్దం నెలకొంది. అయితే ప్రతికూల వాతావరణం, స్లో ఓవర్‌ రేట్ కారణంగా ఐదు రోజుల్లో నిర్ణీత ఓవర్లు పూర్తికాకపోతే ఆటను ఆరో రోజుకు పొడిగించే విషయంపై ఐసీసీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత్-న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్‌లో జరిగే ఈ మెగా ఫైనల్ ప్లేయింగ్ కండిషన్స్‌పై ఈ వారంలో ఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది. అంతేకాక డబ్ల్యూటీసీ భవితవ్యంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ కనిపిస్తోంది.

అవసరమైతే ఆరో రోజు..

అవసరమైతే ఆరో రోజు..

తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతలు అంటే ఏమాత్రం బాగుండదని, సాధ్యమైనంత వరకు ఫలితం కోసం ప్రయత్నించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. 'డబ్ల్యూటీసీ ఫైనల్‌కు 'రిజర్వ్‌ డే' ఉంచాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీని ప్రకారం ఐదు రోజుల్లో వాతావరణ సమస్య వల్ల 30 గంటలకంటే తక్కువ ఆట జరిగితే ఆరో రోజు కూడా టెస్టు ఆడించాలనేది ఒక ఆలోచన.

అయితే గంటల లెక్కను చూస్తే స్లో ఓవర్‌ రేట్‌ సమస్య రావచ్చు కాబట్టి 450 ఓవర్లకంటే తక్కువ పడితే రిజర్వ్‌ డేను కొనసాగించాలనేది మరో ఆలోచన. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం' అని ఐసీసీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

సంయుక్త విజేతపై నో ఇంట్రస్ట్..

సంయుక్త విజేతపై నో ఇంట్రస్ట్..

డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్ కావడంతో సంయుక్త విజేత విధానంపై ఐసీసీ అంతగా ఆసక్తి చూపడం లేదని కూడా సదరు అధికారి తెలిపారు. కచ్చితంగా మ్యాచ్ విన్నర్ ఉండాలనే చూస్తున్నదని స్పష్టం చేశారు. 'డబ్ల్యూటీసీ ఫస్ట్ ఎడిషన్ కావడం వల్ల జాయింట్ విన్నర్స్ కాన్సెప్ట్‌పై పెద్దగా ఆసక్తిలేదు. మ్యాచ్ రిజల్ట్ తేలేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిపై ఐసీసీ కమిటీ వర్క్ చేస్తుంది. ఈ వారంలో ప్లేయింగ్ కండిషన్స్ వెలువడే అవకాశం ఉంది.'అని ఐసీసీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

డబ్ల్యూటీసీ కొనసాగింపు కష్టమే..

డబ్ల్యూటీసీ కొనసాగింపు కష్టమే..

మరోవైపు అసలు రాబోయే రోజుల్లో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ కొనసాగుతుందా అనే అంశంపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. అనుకున్న స్థాయిలో డబ్ల్యూటీసీ విజయవంతం కాలేదని, ఫార్మాట్, పాయింట్ల కేటాయింపు విధానంపై బాగా విమర్శలు వచ్చాయని పలువురు సభ్యులు భావిస్తున్నారు. పైగా ఏడాదిపాటు కరోనా కారణంగా షెడ్యూల్‌ మొత్తం దెబ్బతింది. దాంతో దీనిపై జూన్‌ 1న జరిగే ఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వాస్తవానికి 2019లో డబ్ల్యూటీసీ ప్రకటించినప్పుడే 2021-23 సీజన్ కూడా ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. అంతేకాక మిగిలిన ఐసీసీ టోర్నీల మాదిరిగానే డబ్ల్యూటీసీ కొనసాగుతుందని పేర్కొంది. అయితే త్వరలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. 2022-23 సీజన్‌లో ఇండియాకు ఇది తొలి సిరీస్ కాగా, డబ్ల్యూటీసీ సెకండ్ ఎడిషన్‌పై ఐసీసీ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. అంతేకాక డబ్ల్యూటీసీ కొనసాగింపునకు ఐసీసీ బోర్డు సభ్యుల్లో చాలా మంది ఆసక్తి చూపడం లేదు.

Story first published: Thursday, May 27, 2021, 18:50 [IST]
Other articles published on May 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+