For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో నయా రూల్స్.. ఆటగాళ్లకు దబిడి దిబిడే!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నయా రూల్స్ ప్రవేశపెట్టింది. ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఈ రూల్స్‌ను తీసుకొచ్చింది. వీటిలో కొన్ని రూల్స్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో అమలు కానుండగా.. మరికొన్ని జూలై 2 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ రూల్స్‌ ఏంటో తెలుసుకుందాం.

1. స్టాప్ క్లాక్ రూల్

ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్టాప్ క్లాక్ రూల్‌ను అమలు చేస్తున్నారు. స్లో ఓవర్ రేట్‌‌ను కట్టడి చేసేందుకు ఐసీసీ ఈ రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం ఓవర్ ముగిసిన తర్వాత మరో ఓవర్‌ను 60 సెకన్లలో మొదలుపెట్టాల్సి ఉంటుంది. తాజాగా టెస్ట్‌ క్రికెట్‌లోనూ ఈ స్టాప్ క్లాక్ రూల్‌ను ఐసీసీ ప్రవేశపెట్టింది. ఈ రూల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27తోనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ రూల్ ఉల్లంఘిస్తే అంపైర్లు రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడో సారి కూడా రిపీట్ అయితే ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. బ్యాటింగ్‌ జట్టుకు అదనంగా 5 పరుగులు ఇస్తారు. అదే సమయంలో బౌలింగ్ జట్టు నుంచి 5 పరుగులను కట్ చేస్తారు. అయితే ప్రతీ 80 ఓవర్ల తర్వాత ఈ రూల్ రీస్టార్ట్ అవుతుంది. వన్డే, టీ20ల్లో ఈ రూల్ 2024 జూన్ నుంచే అమలు చేస్తున్నారు.

ICC Modifies Playing Conditions Across Formats

2. వన్డేల్లో బంతుల ఉపయోగంపై ఆంక్షలు..

ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో రెండు బంతులు వాడుతున్నారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి 50 ఓవర్ల వరకు రెండు బంతులు ఉపయోగిస్తున్నారు. ఐసీసీ సవరించిన రూల్ ప్రకారం 34 ఓవర్ల వరకే రెండు కొత్త బంతులు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ రెండు బంతుల్లో నుంచి ఒక్క బంతిని మాత్రమే ఉపయోగించాలి. బంతుల ఆకారం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అనివార్య కారణాలతో మ్యాచ్ 35 ఓవర్లు లేదా అంతకు లోపే కుదించితే ఒక్క బంతితోనే ఆడాల్సి ఉంటుంది. ఈ రూల్ జులై 2న జరగనున్న శ్రీలంక- బంగ్లాదేశ్ మ్యాచ్​‌తో అమల్లోకి రానుంది.

3. బౌండరీ లైన్ క్యాచ్‌ రూల్ మార్పు..

బౌండరీ లైన్‌పై ఫీల్డర్లు చేసే క్యాచ్ విన్యాసాలపై ఐసీసీ ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఫీల్డర్ బంతిని క్యాచ్ పట్టి.. ఆ తర్వాత సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ దాటినప్పుడు బంతిని గాల్లోకి విసిరేసి మళ్లీ అందుకోవడం చేస్తుంటారు. గతంలో బౌండరీ లైన్‌పై నేలకు తాకకుండా బంతిని ఎన్నిసార్లు పట్టుకున్నా అనుమతించేవారు. కానీ ఇక నుంచి బౌండరీ లైన్ ధాటరంటే.. మళ్లీ లోపలికి వచ్చి మాత్రమే బంతిని పట్టుకోవాలి. బయట మరోసారి బంతిని అందుకునేందుకు అవకాశం లేదు. అలా అందుకుంటే సిక్సర్‌గానే పరిగణిస్తారు. ఒకే ప్రయత్నంలో బంతిని లోపలికి వేసి వచ్చి క్యాచ్ అందుకోవాలి.

4. సెలైవా ఉపయోగించడం..

కరోనా సమయంలో బంతికి సెలైవా(ఉమ్మి) రాయడాన్ని ఐసీసీ నిషేధించింది. ఐపీఎల్ 2025 సీజన్‌‌లో ఈ నిషేధాన్ని ఎత్తివేసినా..అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతోంది. అయితే బౌలింగ్‌ టీమ్ బంతి మార్పు కోసం ఉద్దేశపూర్వకంగా ఉమ్మి రాసినా.. మార్చడం తప్పనిసరి కాదు. బంతి మార్పు అనేది అంపైర్లు తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.


5. షార్ట రన్ రూల్

ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీస్తే.. ప్రస్తుతం ఉన్న ఐదు పరుగుల పెనాల్టీ రూల్ కొనసాగుతుంది. అయితే, ఇప్పుడు బౌలింగ్ జట్టు తదుపరి డెలివరీకి ఏ బ్యాటర్ స్ట్రైక్‌లో ఉండాలో ఎంచుకోవచ్చు. వ్యూహాత్మకంగా షార్ట్ రన్స్ తీసుకోవడాన్ని నిరోధించేందుకు ఐసీసీ ఈ రూల్ తీసుకొచ్చింది.

6.నో బాల్ క్యాచ్ :

ప్రస్తుతం నో బాల్‌కు ఫీల్డర్ క్యాచ్ పడితే.. క్యాచ్ సరిగ్గా పట్టారా లేదా? అనేది పరిశీలించేవారు కాదు. కానీ ఇకపై నోబాల్ క్యాచ్‌లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. క్యాచ్ సరిగ్గా పడితే నోబాల్ ద్వారా వచ్చే ఒక్క పరుగు మాత్రమే ఇస్తారు. ఒకవేళ క్యాచ్ సరిగ్గా పట్టకపోతే.. బ్యాటింగ్ జట్టు ఎన్ని పరుగులు తీస్తే అన్ని పరుగులతో పాటు నోబాల్ రన్ కూడా కలుపుతారు.

7. డీఆర్‌ఎస్ వికెట్ జోన్

ఎల్బీడబ్ల్యూ వికెట్ల విషయంలో ఖచ్చితమైన డీఆర్‌ఎస్ నిర్ణయాల కోసం స్టంప్స్, బెయిల్స్ లైన్‌ను వికెట్ జోన్‌గా పరిగణిస్తారు. ఇది ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో ఖచ్చితత్వం తీసుకురానుంది.

గతంలో ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల కోసం డీఆర్‌ఎస్‌లో 'వికెట్ జోన్'అనేది స్టంప్స్ కొత్త ఊహాత్మ ప్రాంతాన్ని కలిగే ఉండేది. ఇది బంతి స్టంప్స్‌కు తగిలినట్లు సాంకేతికంగా చూపించినా.. 50 శాతం కంటే తక్కువగా స్టంప్స్‌కు తగిలితే అంపైర్ కాల్ కింద బ్యాటర్‌కు నాటౌట్ ఇచ్చేవారు. ఇప్పుడు వికెట్ జోన్ అనేది స్టంప్స్ మరియు బెయిల్స్ యొక్క అసలు భౌతిక అవుట్‌లైన్‌గా ఉంటుంది.

8. వైడ్ బాల్ రూల్..

కొత్త వైడ్ బాల్ రూల్ ప్రకారం.. బౌలర్ బంతిని వేసే సమయంలో బ్యాటర్ కాళ్ల స్థానాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత బ్యాటర్ కదిలినా ఈ స్థానాన్ని పరిగణలోకి తీసుకొనే వైడ్‌పై నిర్ణయం తీసుకుంటారు.

9.కంకషన్ ప్రోటోకాల్స్..

కంకషన్ రిప్లేస్‌మెంట్ రూల్స్‌ను కూడా ఐసీసీ మార్చింది. మ్యాచ్‌కు ముందే కంకషన్ సబ్‌స్టిట్యూట్ లిస్ట్ ఇవ్వాలి. ఒక ఆటగాడు కంకషన్ గాయానికి గురై జట్టుకు దూరమైతే.. అతను మరో మ్యాచ్ ఆడేందుకు కనీసం ఏడు రోజుల విశ్రాంతి తీసుకోవాలి. ఆటగాళ్ల భద్రత, శ్రేయస్సు కోసం ఈ మార్పు చేశారు.

10. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్

అక్టోబర్ 2025 నుంచి ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్ రూల్‌ అమలు చేయనున్నారు. ఈ రూల్ ప్రకారం మ్యాచ్ ప్రారంభమైన తర్వాత మైదానంలో తీవ్రమైన గాయానికి గురైన ఆటగాడి స్థానంలో లైక్-ఫర్ లైక్ ఆటగాడితో భర్తీ చేయవచ్చు.

Story first published: Friday, June 27, 2025, 17:33 [IST]
Other articles published on Jun 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+