Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆడింది 16 మ్యాచ్‌లే.. అయినా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానం!!

ICC Men’s T20I Rankings: Dawid Malan topples Babar Azam to grab top spot

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం డేవిడ్‌ మలన్‌ దుమ్ములేపాడు. 877 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన మలన్..‌ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరచుకున్నాడు. ఇటీవల జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో మలన్‌ అద్భుతంగా రాణించాడు. పొట్టి ఫార్మాట్‌లో 16 మ్యాచ్‌లే ఆడిన మలన్ అతి తక్కువ కాలంలోనే నంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

టాప్ లేపిన మలన్‌

33 ఏళ్ల డేవిడ్‌ మలన్‌ ఇంగ్లండ్ తరఫున 16 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 682 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ (103 నాటౌట్) ఉంది. ఇక 7 అర్ధ శతకాలు కూడా బాదాడు. 2017 నుంచి టీ20లు ఆడుతున్న మలన్‌.. 48.7 యావరేజ్, 146.7 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక్క వన్డే మాత్రమే మలన్‌ ఆడాడు. అందులో 24 పరుగులు చేశాడు. ఇక 15 టెస్ట్ మ్యాచ్‌లలో 724 రన్స్ బాదాడు. ఇందులో ఒక శతకం, 6 అర్ధ శతకాలు ఉన్నాయి.

రాహుల్@4

రాహుల్@4

డేవిడ్‌ మలన్‌ తర్వాత పాక్‌ స్టార్‌ ప్లేయర్‌ బాబర్‌ అజామ్‌ (869), అస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ పించ్ ‌(835), టీమిండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్ ‌(824), న్యూజీలాండ్ ఓపెనర్ కోలిన్‌ మున్రో (785) టాప్‌-5లో కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (673) తొమ్మితో స్థానంలో నిలిచాడు. ర్యాంకింగ్స్‌లో ఇద్దరు భారత క్రికెటర్లకు మాత్రమే మెరుగైన స్థానాలు దక్కాయి.

మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంకులో ఆస్ట్రేలియా

ఇంగ్లండ్‌తో ఆఖరిదైన మూడో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొంది. ఆతిథ్య ‌ ఇంగ్లండ్‌ నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 19.3 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ‌ ఇంగ్లండ్‌ చేతిలో వైట్‌వాష్‌ నుంచి తప్పించుకున్నది. చివరి టీ20లో గెలుపొందిన ఆస్ట్రేలియా ‌(275 రేటింగ్‌ పాయింట్లు) టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నది. ఇంగ్లండ్‌ 271 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉంది. ఆస్ట్రేలియా -ఇంగ్లండ్‌ రెండు జట్ల మధ్య కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉన్నది. ఇక మూడో స్థానంలో భారత్‌ ఉండగా.. నాలుగు, ఐదు స్థానాల్లో పాకిస్థాన్‌, సౌతాఫ్రికాలు వరుసగా ఉన్నాయి.

రషీద్ ఖాన్@1

రషీద్ ఖాన్@1

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్‌కి చెందిన యువ సంచలనం రషీద్ ఖాన్ 736 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (730), ఆస్టన్ అగర్ (706), తబ్రేజ్ షంసీ (681), ఆడమ్ జంపా (7679)లు టాప్-5లో ఉన్నారు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లోనూ అఫ్గాన్‌కి చెందిన మహ్మద్ నబీ 294 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉన్నాడు. బౌలింగ్, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ భారత ఆటగాళ్లు ఎవరూ టాప్-5లో చోటు దక్కించుకోలేకపోయారు.

IPL 2020: ప్రత్యేక విమానంలో దుబాయ్‌ బయలుదేరిన సౌరవ్ గంగూలీ!!

Story first published: Wednesday, September 9, 2020, 16:55 [IST]
Other articles published on Sep 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+