ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి మరో 3 నెలల సమయం మాత్రమే ఉంది. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయడంపై ఐసీసీ తుది సన్నాహాకాలు చేస్తోంది.
భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించే విషయంపై స్పష్టత రాకపోవడంతో ఈ టోర్నీ షెడ్యూల్‌పై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీకి ప్రతిపాదిత షెడ్యూల్‌ను పంపించింది.

మరోవైపు పాకిస్థాన్‌లో టీమిండియా పర్యటించేందుకు భారత ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. తమకు తటస్థ వేదికలను ఏర్పాటు చేయాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇందుకు అనుకూలంగా కావాల్సిన ఖర్చులకు ఐసీసీ.. ఛాంపియన్స్ టోర్నీ నిర్వహణ బడ్జెట్‌ను పెంచింది. అయితే భారత్ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయా? లేక విదేశాల్లో నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రాలేదు.
మరోవైపు ఈ నెల 10న ఐసీసీ బృందం పాకిస్థాన్‌లో పర్యటించి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. ఆ మరుసటి రోజు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించినున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, భారత జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి.
గ్రూప్-బీలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్లు ఉండగా.. ఫిబ్రవరి 20న లాహోర్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఫిబ్రవరి 23న లాహోర్‌లో న్యూజిలాండ్‌తో, మార్చి 1న అదే లాహోర్ వేదికగా పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. మార్చి 5, 6 తేదీల్లో సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. అయితే పాకిస్థాన్‌లో పర్యటించేందుకు టీమిండియాకు భారత ప్రభుత్వం అనుమతివ్వకపోతే మాత్రం ఈ షెడ్యూల్ మారనుంది. తటస్థ వేదికగా భారత్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఫిబ్రవరి 19 న్యూజిలాండ్ vs పాకిస్తాన్, కరాచీ
ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్ vs ఇండియా, లాహోర్
ఫిబ్రవరి 21 ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ
ఫిబ్రవరి 22 ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 23 న్యూజిలాండ్ vs ఇండియా, లాహోర్
ఫిబ్రవరి 24 పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, రావల్పిండి
ఫిబ్రవరి 25 ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 26 ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 27 బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, లాహోర్
ఫిబ్రవరి 28 ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, రావల్పిండి
మార్చి 1 పాకిస్తాన్ vs ఇండియా, లాహోర్
మార్చి 2 దక్షిణాఫ్రికా vs ఇంగ్లండ్, రావల్పిండి
మార్చి 5 సెమీ-ఫైనల్: TBC vs TBC, కరాచీ
మార్చి 6 సెమీ-ఫైనల్: TBC vs TBC, రావల్పిండి
మార్చి 9 ఫైనల్: TBC vs TBC, లాహోర్