Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు మరో షాక్‌.. చివరి టీ20 స్లో ఓవర్ రేట్‌తో..

ICC fines India for slow over-rate in final T20I against New Zealand

మౌంట్‌మాంగనీ : న్యూజిలాండ్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే చివరి టీ20 గాయపడ్డ రోహిత్ శర్మ మిగతా సిరీస్‌లకు దూరమవ్వగా.. ఈ బాధలో ఉన్న కోహ్లీ సేనకు ఐసీసీ మరో షాకిచ్చింది. ఆదివారం జరిగిన చివరి టీ20లో స్లోఓవర్‌ రేట్‌ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నట్టు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

'ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్‌ 2.22 ప్రకారం ప్రతి ఓవర్‌ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేనిపక్షంలో ఒక ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్‌ ఫీజులో కోత తప్పదు. టీమిండియా చివరి టీ20లో ఒక ఓవర్‌ ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించింది. ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ బ్రోన్‌, షాన్‌ హేగ్‌ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ చర్యలు తీసుకున్నారు.'ఐసీసీ పేర్కొంది.

ఇక టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్లోఓవర్‌ రేట్‌ను అంగీకరించాడని, తదుపరి వాదనలు ఉండవని రిఫరీ వెల్లడించారు. ఇక.. వెస్ట్‌ప్యాక్‌ స్టేడియంలో జరిగిన నాలుగో టీ20లోనూ టీమిండియా రెండు ఓవర్లు ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించింది. దీంతో భారత ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 40 శాతం పెనాల్టీ విధించింది. కాగా, ఆదివారం జరిగిన ఐదో టీ20లో టీమిండియా 7 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన తొలి జట్టుగా భారత్‌ నయా చరిత్ర సృష్టించింది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (60 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ (45) తన ఫామ్‌ను కొనసాగించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో కుగ్లిన్ రెండు వికెట్లు తీయగా.. బెన్నెట్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓటమి పాలైంది టిమ్ సీఫెర్ట్(50), రాస్ టేలర్(52 ) అద్భుత ప్రదర్శన కనబర్చినా ఫలితం లేకపోయింది.

భారత బౌలర్లలో బుమ్రా (3/12) మూడు వికెట్లు తీయగా.. సైనీ, ఠాకుర్ రెండేసి వికెట్ల పడగొట్టారు. ఇక సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్న కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వరించగా.. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

Story first published: Monday, February 3, 2020, 19:36 [IST]
Other articles published on Feb 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+