Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుడ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్ వాయిదాపై ఐసీసీ అధికారిక ప్రకటన.. ఐపీఎల్‌కు లైన్ క్లియర్

ICC confirms the postponement of the T20 World Cup 2020 due to the novel coronavirus pandemic
ICC Postpones T20 Cricket World Cup 2020 || Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. కరోనా వైరస్ పుణ్యమా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డు వర్చువల్ మీటింగ్‌లో ఈ మెగాటోర్నీ వాయిదాపై తుది నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్‌కు మార్గం సుగుమమైంది. పొట్టి ప్రపంచకప్ నిర్వహించాల్సిన అక్టోబర్-నవంబర్ విండోలోనే ఐపీఎల్ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెగా టోర్నీ వాయిదాపై ఐసీసీ అధికారిక ప్రకటన కోసం ఇన్నాళ్లు వేచి చూసింది.

ట్రిపుల్ ధమాకా..

ట్రిపుల్ ధమాకా..

వరుసగా మూడేళ్లు మూడు మెగాటోర్నీలు ఉంటాయని ఐసీసీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందుకోసం తమ ద్వైపాక్షిక సిరీసుల ప్రణాళికలను సవరించుకొనేందుకు ఆయా బోర్డులు అంగీకరించాయని వెల్లడించింది.

‘ఈ రోజు జరిగిన ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో కరోనాతో కలిగిన అంతరాయం కారణంగా తదుపరి ఐసీసీ పురుషుల ఈవెంట్స్ విండోస్ సర్దుబాటు చేశాం. రాబోయే మూడేళ్లలో ఈ విపత్కర పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఉన్న అవకాశాలపై చర్చించాం. ఆయా బోర్డులు కూడా తమ నిర్ణయాలపై సుముఖత వ్యక్తం చేశాయి'అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.

2021లో భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌కు అక్టోబర్- నవంబర్ విండో కేటాయించిన ఐసీసీ.. ఫైనల్ నవంబర్ 14న జరుగుతుందని తెలిపింది. 2022లో జరిగే పొట్టి ప్రపంచకప్‌ కూడా అక్టోబర్-నవంబర్ విండోలోనే జరుగుతందని, ఫైనల్ మాత్రం నవంబర్ 13న నిర్వహించనుంది. ఇక భారత్ వేదికగానే జరిగే 2023 వన్డే ప్రపంచకప్ కూడా ఇదే విండోలో జరుగుతుందని, ఫైనల్ మాత్రం నవంబర్ 26న జరుగుతందని స్పష్టం చేసింది.

న్యూజిలాండ్‌ వేదికగా 2021లో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచకప్ మాత్రం షెడ్యూలు ప్రకారమే ఉంటుందని ఐసీసీ తెలిపింది.

శశాంక్ మనోహర్ తప్పుకోవడంతో..

శశాంక్ మనోహర్ తప్పుకోవడంతో..

కరోనా వైరస్ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌కు తాము ఆతిథ్యం ఇవ్వలేమని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసినా.. ఐసీసీ మాత్రం ఎటు తేల్చకుండా నాన్చింది. భారత్‌కే చెందిన శశాంక్‌ మనోహార్‌ ఛైర్మన్‌గా ఉన్నన్ని రోజులూ ఈ విషయంపై ఐసీసీ ఎటు తేల్చలేదు. ఎలాగైనా టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలనే పట్టుదలతో కనిపించింది. ఇటీవల ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో మెగాటోర్నీ వాయిదా ప్రకటన వెలువడింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్న ఐసీసీ భవిష్యత్తు ప్రపంచకప్‌ల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసింది.

నిరవధిక వాయిదా..

నిరవధిక వాయిదా..

ఇక మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా పుణ్యమా తొలుత ఏప్రిల్ 15కు ఆతర్వాత నిరవధికంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ఈ ఏడాది జరగకపోతే బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీలు వేల కోట్ల రూపాయాలను నష్టపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లేకుండా తక్కువ రోజుల్లో మినీ ఐపీఎల్‌నైనా నిర్వహించాలనే పట్టుదలతో బీసీసీఐ ఉంది. అవసరమైతే విదేశాల్లో నిర్వహించేందుకు కూడా సిద్దమైంది.

దుబాయ్‌లో ఐపీఎల్..

దుబాయ్‌లో ఐపీఎల్..

ఇక దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో విదేశాల్లో నిర్వహించేందుకు కూడా బీసీసీఐ ప్రణాళికలు రచించింది. దుబాయ్‌లో నిర్వహించేందకు సిద్దమైందనే వార్తలు కూడా వచ్చాయి. అటు ఫ్రాంచైజీలు కూడా చార్టెడ్ ఫ్లైట్స్‌ను అద్దే తీసుకోవడంపై దృష్టి సారించాయనే ప్రచారం జరిగింది. అయితే ఐపీఎల్ జరగకుండా 2020 ముగియదని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మాటలు కూడా మెగాటోర్నీ నిర్వహణపై భరోసానిస్తున్నాయి.

Story first published: Monday, July 20, 2020, 21:18 [IST]
Other articles published on Jul 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+